ఈటల గెలవాలని బండికి లేదు: పొన్నం

విధాత: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాలు ముందు ఊహించినట్లుగానే వస్తున్నాయని కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మంత్రివర్గం నుంచి తొలగించడం అప్రజాస్వామికం అనే విషయాన్ని ఈటల రాజేందర్‌ ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారని చెప్పారు. హుజూరాబాద్‌ ఎన్నికలు.. భాజపా గెలుపుగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పుకోవడం దురదృష్టకరమని పొన్నం అన్నారు. ఈటల గెలవాలన్న ఆలోచన బండి సంజయ్‌లో ఎక్కడా కనిపించలేదని ఆయన ఆరోపించారు.