అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌.. నిరుద్యోగులకు రాహుల్‌ గాంధీ హామీ

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని ఆ పార్టీ కీలక నేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు

అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌.. నిరుద్యోగులకు రాహుల్‌ గాంధీ హామీ

హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో ఆకస్మిక పర్యటన


విధాత : కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని ఆ పార్టీ కీలక నేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. శనివారం అశోక్‌నగర్‌లో ఆకస్మికంగా పర్యటించిన రాహుల్‌.. అక్కడి విద్యార్థులను, పరీక్షార్థులను కలిశారు. జాబ్‌ క్యాలెండర్‌పై ఇచ్చిన పత్రికా ప్రకటనను ఆయన ప్రదర్శించారు. నిరుద్యోగుల సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించారు. తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి పరీక్షార్థులు రాహుల్‌కు వివరించారు.