కొల్లాపూర్ సభకు ప్రియాంక స్థానంలో రాహుల్‌గాంధీ

విధాత : కొల్లాపూర్‌లో మంగళవారం కాంగ్రెస్ బహిరంగ సభకు ప్రియాంక గాంధీ స్థానంలో రాహుల్‌గాంధీ హాజరుకానున్నారు. అనారోగ్య కారణంతో చివరి నిమిషంలో ఆమె పర్యటన రద్దు చేసుకున్నారు. దీంతో ఆమె స్థానంలో రాహుల్‌గాంధీ ఈ బహిరంగ సభకు హాజరుకాబోతున్నారు.
అంతకుముందే దేవరకద్రలో ఏర్పాటు చేసిన మహిళలతో ప్రియాంకగాంధీ ముఖాముఖి కార్యక్రమం కూడా రద్ధయ్యింది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో కొల్లాపూర్‌లో భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేశారు.