‘పునరావాస ప్రాంతం పరిశీలించి నివేదిక ఇవ్వాలి’..హైకోర్టు

విధాత:హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా అనంతగిరి భూనిర్వాసితుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇల్లంతకుంట మండలం అనంతగిరికి చెందిన 58 మంది పిటిషన్లపై విచారించింది.కాళేశ్వరం ప్రాజెక్టు భూనిర్వాసితులకు ఇళ్లస్థలాలు అప్పగించడం లేదని పిటిషనర్లు పేర్కొన్నారు.అలాగే పునరావాస కాలనీలో సరైన వసతులు కల్పించడం లేదని పిటిషనర్లు తెలిపారు. నిర్వాసితులకు 70 కోట్లతో ప్లాట్లు సిద్ధం చేసినట్లు తెలిపిన ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. తాత్కాలికంగా డబుల్ బెడ్ రూం ఫ్లాట్లు ఇచ్చినట్లు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ప్లాట్లు స్వాధీనం చేసుకోవడానికి […]

‘పునరావాస ప్రాంతం పరిశీలించి నివేదిక ఇవ్వాలి’..హైకోర్టు

విధాత:హైదరాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా అనంతగిరి భూనిర్వాసితుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇల్లంతకుంట మండలం అనంతగిరికి చెందిన 58 మంది పిటిషన్లపై విచారించింది.కాళేశ్వరం ప్రాజెక్టు భూనిర్వాసితులకు ఇళ్లస్థలాలు అప్పగించడం లేదని పిటిషనర్లు పేర్కొన్నారు.అలాగే పునరావాస కాలనీలో సరైన వసతులు కల్పించడం లేదని పిటిషనర్లు తెలిపారు. నిర్వాసితులకు 70 కోట్లతో ప్లాట్లు సిద్ధం చేసినట్లు తెలిపిన ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. తాత్కాలికంగా డబుల్ బెడ్ రూం ఫ్లాట్లు ఇచ్చినట్లు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ప్లాట్లు స్వాధీనం చేసుకోవడానికి భూనిర్వాసితులు నోటీసులు తీసుకోవడం లేదని ప్రభుత్వం పేర్కొంది. సరైన వసతులు లేవంటూ నోటీసులు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారని ప్రభుత్వం తెలిపింది. పరిశీలన కోసం సిరిసిల్ల జూనియర్ సివిల్ జడ్జిని హైకోర్టు నియమించింది.పునరావాస ప్రాంతం పరిశీలించి నివేదిక ఇవ్వాలని జూ.సివిల్ జడ్జికి హైకోర్టు ఆదేశించింది.తదుపరి విచారణ ఆగస్టు రెండో వారానికి హైకోర్టు వాయిదా వేసింది.