పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకున్న రేవంత్
విధాత: టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టే ముందు జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడికి చేరుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గాంధీభవన్‌కు రేవంత్ ర్యాలీగా బయల్దేరారు. గాంధీభవన్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు టీపీసీసీ తాజా మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నుంచి రేవంత్ బాధ్యతలు స్వీకరిస్తారు. తదుపరి గాంధీభవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రేవంత్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, ఎమ్మెల్యే సీతక్క ఉన్నారు. రేవంత్ ర్యాలీకి అభిమానులు, కాంగ్రెస్ […]

విధాత: టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బుధవారం బాధ్యతలు చేపట్టే ముందు జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడికి చేరుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గాంధీభవన్‌కు రేవంత్ ర్యాలీగా బయల్దేరారు. గాంధీభవన్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు టీపీసీసీ తాజా మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నుంచి రేవంత్ బాధ్యతలు స్వీకరిస్తారు. తదుపరి గాంధీభవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగిస్తారు. రేవంత్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, ఎమ్మెల్యే సీతక్క ఉన్నారు. రేవంత్ ర్యాలీకి అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి.