డీబీటీ పద్ధతిలో రైతు బంధు

డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పద్ధతిలో నేరుగా లబ్ధిదారులకు పెట్టుబడి సాయం అందేలా రైతుబంధు పథకం అమలయ్యేలా కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు

డీబీటీ పద్ధతిలో రైతు బంధు

 నేరుగా బ్యాంకు నుండి లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు

– వరుస బ్యాంకు సెలవుల నేపథ్యంలో అధికారులకు సీఎం ఆదేశాలు

విధాత: డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పద్ధతిలో నేరుగా లబ్ధిదారులకు పెట్టుబడి సాయం అందేలా రైతుబంధు పథకం అమలయ్యేలా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యాసంగి పంటకు పెట్టుబడి సాయంగా అందిస్తున్న మొత్తాన్ని రైతుబంధు పథకం కింద అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన విషయం తెలిసిందే.

బంగారు గుర్రాలు.. ఎక్కడో తెలుసా?


అయితే ఈ లోపు ఎన్నికల షెడ్యూల్ రావడంతో రైతాంగానికి పెట్టుబడి సాయాన్ని ఎన్నికల సంఘం ఆపింది. రైతుబంధు పథకాన్ని వాయిదా వేస్తే రైతులు నష్టపోతారంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘంతో చర్చించి ఒప్పించింది. దీంతో రైతుబంధు పథకానికి అనుమతిచ్చిన విషయం తెలిసిందే.

ప్రభుత్వ వ్యతిరేకతను బీఆరెస్‌ అధిగమిస్తుందా?


ఈ క్రమంలో ఈనెల 25, 26, 27 తేదీల్లో వరుసగా బ్యాంకులకు సెలవులు ఉండడం, 29, 30 తేదీలలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బ్యాంకు అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించింది. డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు నగదు వేసి, రైతుబంధు పథకం అమలు చేసేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

రైతులు రంది ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.. 6వ తేదీ నుంచి యధావిధిగా రైతుబంధు : సీఎం కేసీఆర్