సాగర్ ఎడమ కాలువకు.. నేడు నీటి విడుదల

సాగర్ ఎడమ కాలువకు.. నేడు నీటి విడుదల

నాగర్జున సాగర్ ,అక్టోబర్ 6 .నాగార్జునసాగర్ ఎడమ కాలువకు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేతుల మీదుగా నీటి విడుదల చేయనున్నట్టు ఎన్ఎస్పి అధికారులు తెలిపారు. కాగా రెండు రోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వం సాగర్ ఎడమ కాలువ కు నీటి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.



కానీ సాగర్ ఎడమ కాలువ నీటి విడుదల విషయంలో స్థానిక ఇరిగేషన్ అధికారులకు ఎటువంటి సమాచారం లేకపోవడం గమనార్హం.. కొన్ని సామాజిక మాధ్యమ లలో ఎడమ కాలువకు నేటి విడుదల చేసినట్లుగా రావడంతో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు సాగర్ డ్యామ్ అధికారులు శనివారం సాగర్ ఎడమ కాలువకు మంత్రి జగదీశ్వర్ రెడ్డి నీటి విడుదల చెయ్యనున్నట్లుగా ప్రకటించారు.