Hyderabad | గోల్కొండ వద్ధ కంటైనర్‌లో 800కిలోల గంజాయి పట్టివేత
హైదరాబాద్‌లో మరోసారి పెద్దమొత్తంలో గంజాయి పట్టుబడింది. నగరంలోని పెద్ద గోల్కొండ వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై ఓ కంటైనర్‌లో 800 కిలోల గంజాయిని బాలానగర్ ఎస్‌ఓటీ, శంషాబాద్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌లో పోలీసులు పట్టుకున్నారు

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్‌లో మరోసారి పెద్దమొత్తంలో గంజాయి పట్టుబడింది. నగరంలోని పెద్ద గోల్కొండ వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై ఓ కంటైనర్‌లో 800 కిలోల గంజాయిని బాలానగర్ ఎస్‌ఓటీ, శంషాబాద్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌లో పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కంటైనర్ పెద్ద అంబర్‌పేట్ వైపు నుంచి గచ్చిబౌలి వైపు వస్తున్నదని చెప్పారు. గంజాయిని ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్టు గుర్తించారు. పట్టుబడిన గంజాయి నాణ్యతలో మేటిగా ఉందని, కంటైనర్‌తో పాటు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
@cyberabadpolice along with SOT Balanagar, Shamshabad police and @TG_ANB busted the trafficking of Ganja & nabbed 5 interstate Drug peddlers. And seized 803 Kgs of Ganja, DCM container and 4 wheeler worth 2,94,75,00/- pic.twitter.com/ess5WiIvk1
— Cyberabad Police (@cyberabadpolice) August 4, 2024
అరకుకు చెందిన మెయిన్ పెడ్లర్ రాము పెద్ద మొత్తంలో గంజాయిని ఇతర రాష్ట్రాలకు సప్లై చేస్తున్నాడని, అతను పరారీలో ఉన్నాడని, మొత్తం ఏడుగురు నిందితులను గుర్తించామని చెప్పారు. పట్టుబడిన గంజాయి విలువ 2కోట్ల 94లక్షల 75వేల రూపాయలుగా ఉందని తెలిపారు. కంటెయినర్‌కు ముందు ఎస్కాట్ వాహనం కూడా మెయింటెన్ చేస్తున్నారని, ముందు ఎక్కడైనా తనిఖీలు ఉంటే కంటెయిన్ డ్రైవర్‌కు సమాచారం ఇవ్వడం, టోల్‌గేట్ల వద్ద నెంబర్ ప్లేట్ లేకుండా వెళ్లడం వంటి చర్యలతో గంజాయి అక్రమ రవాణ చేస్తున్నట్లుగా తెలిపారు.