మందు పార్టీ చేసుకుంటున్నారా.? కొంచెం జాగ్రత్తగా ఉండండి.!
తెలంగాణలో ఇకనుండి పార్టీలు చేసుకునే ఫ్రెండ్స్, బంధువులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ ఆబ్కారీ శాఖ డేగకళ్లతో చూడబోతోంది. తేడాగా దొరికితే ఇక అంతే..

తెలంగాణ ఆబ్కారీ(Telangana Prohibition & Excise department) శాఖ, వ్యక్తులు సొంతంగా చేసుకునే మద్యం పార్టీల(Private Liquor Parties)పై ఆంక్షలు విధించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇళ్లలో చేసుకునే మందుపార్టీలకు పరిమితి విధించింది. వ్యక్తిగత పార్టీల్లో భారీ ఎత్తున లిక్కర్(Huge Liquor) కావాల్సివచ్చినపుడు తప్పనిసరిగా ఆబ్కారీ శాఖ నుంచి అనుమతి(Permission) తీసుకోవాల్సిఉంటుంది. ఈ మధ్య జరిగిన కొన్ని పార్టీలపై ఆబ్కారీ శాఖ దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయడం సంచలనం సృష్టించింది. దీంతో ప్రజలు వివరాలు తెలియక అయోమయానికి గురవుతున్నారు. తెలంగాణ ఆబ్కారీ శాఖ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలే(Rules)మిటో ఇప్పుడు చూద్దాం.
తెలంగాణ మద్యనిషేధ, ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, హోటళ్లలో, రెస్టరెంట్లలలో ఎక్కువ మొత్తంలో మద్యం వాడకాన్ని (Huge consumption of Liquor)నియంత్రించడానికి నిబంధనలు రూపొందించింది. దాని ప్రకారం, అటువంటి పార్టీలు ఉన్నప్పుడు ముందుగా ఎక్సైజ్ శాఖ ముందస్తు అనుమతి (Prior Permission)తప్పనిసరిగా పొందవలసిఉంటుంది.
ఇక ఇళ్లల్లో చేసుకునే పార్టీలకు మాత్రం 6 బాటిళ్ల వరకు అనుమతి పొందనవసరం లేదు. No permission needed for Home parties upto 6 bottles.
“ఎవరైనా ఒక వ్యక్తి ఒక విందు ఏర్పాటు చేస్తూ, అక్కడ పెద్ద మొత్తంలో మద్యం సేవించే వెసులుబాటు కల్పించినప్పుడు తప్పనిసరిగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నుండి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిఉంటుంది. ఇందుకోసం ఒక అప్లికేషన్ను ఆబ్కారీ శాఖకు సమర్పించి రాతపూర్వక అనుమతి పొందాలి. లేని పక్షంలో తనిఖీల్లో పట్టుబడితే నిర్వాహకులపై చట్టప్రకారం తీవ్ర చర్యలు తీసుకోబడతాయి. అంతేకాకుండా పార్టీ జరుగుతున్న హోటల్, రెస్టారెంట్, ఫాంహౌస్ యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తాం” అని ఆబ్కారీ (P&E) శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈవెంట్ నిర్వాహకులు(Event Organisers) తాము నిర్వహించే వ్యక్తిగత పార్టీల్లో మద్యం సరఫరా చేసేటట్టయితే, ముందుగా ఎక్సైజ్ శాఖ అనుమతి పొందాల్సిందిగా అధికారులు కోరుతున్నారు. సాధారణంగా ఈవెంట్ ఆర్గనైజర్లు ఇటువంటి అనుమతి అభ్యర్తిస్తారు. తరువాత అధికారులు ఆ పరిసరాలను తనిఖీ(inspect the venue) చేసి అంతా బాగుంటే అనుమతి మంజూరు చేస్తారు.
గ్రేటర్ హైదరాబాద్(GHMC) పరిధిలో సామాజిక, కుటుంబ, గెట్ టుగెదర్ లాంటి విందు కార్యక్రమాలకు అనుమతి కోసం ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుము(Fees for permission starts from Rs.10,000) రూ.పది వేల నుండి మొదలవుతుంది. అదే స్టార్ హోటళ్ల(Star Hotels)లో నిర్వహిస్తే ఇంకా ఎక్కువ చెల్లించాలి. ఇక క్రీడలు, వ్యాపార సంబంధిత, వినోద రంగాలకు సంబంధించి అయితే ఇంకా పెద్ద మొత్తంలో ఫీజు చెల్లించి అనుమతి పొందాలి. ఇందుకోసం ఆబ్కారీ శాఖ రెండు సమయాలను కేటాయించింది. ఒకటి ఉదయం 11 గంటలనుండి సా.4 గంటల వరకు, రెండోది రాత్రి 7 గంటల నుండి 11 గంటల వరకు. అప్లికేషన్ (Application process is totally online) వ్యవహారమంతా పూర్తిగా ఆన్లైన్లోనే జరుగుతుంది. అనుమతి పొందడానికి కావాల్సిన ధృవపత్రాలు ఆ పోర్టల్లోనే అప్లోడ్ చేయాలి. అనుమతి కూడా ఆన్లైన్లోనే వస్తుంది. ఎక్కడా దళారీ వ్యవస్థకు తావులేదు అని ఆ ఉన్నతాధికారి స్పష్టం చేసారు.
అనుమతుల కోసం, ఆబ్కారీ శాఖ వెబ్సైట్ https://excise.telangana.gov.in/ లో సంప్రదించి సంబంధిత పత్రాలు అప్లోడ్ చేసి, అక్కడే రుసుము చెల్లిస్తే, తనిఖీ, ధృవీకరణ తరువాత అనుమతులు మంజూరవుతాయి. ఇదంతా 48 గంటలలోగా జరిగిపోతుంది.
Tags: