కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు: ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని, కష్టపడి పని చేసే వారికి గుర్తింపు ఉంటుందనీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు

కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు: ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

– కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు

– బీఆర్ఎస్ లో పలువురి చేరిక

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని, కష్టపడి పని చేసే వారికి గుర్తింపు ఉంటుందనీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. గురువారం చిన్న శంకరంపేట మండలం ఎంపీపీ, వైస్ చైర్మన్, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. అలాగే హవేలీ ఘన్పూర్ మండలం జక్కన్నపేట ఉప సర్పంచ్ అధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి, ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన

ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గ్రామ గ్రామాన అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, భవిష్యత్తులో మెదక్ జిల్లాను మరింత అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు అంజయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి పాల్గొన్నారు