Hyderabad | పెచ్చులూడిన సర్కారీ దవాఖానాపై కప్పు
ప్రభుత్వ ఆసుపత్రి పైకప్పు పెచ్చులు ఊడి పడిన ప్రమాదంలో ఇద్దరు మెడికల్ విద్యార్థినిలకు తీవ్ర గాయాలయ్యాయి.

ఇద్దరు మెడికల విద్యార్థినిలకు గాయాలు
విచారణకు మంత్రి రాజనర్సింహ ఆదేశం
విధాత : ప్రభుత్వ ఆసుపత్రి పైకప్పు పెచ్చులు ఊడి పడిన ప్రమాదంలో ఇద్దరు మెడికల్ విద్యార్థినిలకు తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్ రామాంతపూర్‌లోని డికే గవర్నమెంట్ హోమియోపతి మెడికల్ కాలేజి ఆసుపత్రిలోని పేషెంట్ వార్డులో భవనం పైకప్పు పెచ్చులు ఊడి ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్దినిల తలలపై పడటంతో వారికి తీవ్ర గాయాలయ్యయి. పీజీ విద్యార్థిని స్నేహిత తలకు తీవ్ర గాయమవ్వగా, మరో విద్యార్థిని తలకు కూడా స్వల్పగాయమైంది.
అలాగే ఆసుపత్రిలో పని చేసే హెడ్ నర్సు సునీతకి కూడా స్వల్ప గాయాలయ్యాయి. వారికి స్థానిక ప్రయివేటు ఆసుపత్రిలో ఆత్యవసర చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. కాగా ఈ ప్రమాద ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనరసింహ స్పందించారు. ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆయుష్ విభాగం కమిషనర్‌ను విచారణ జరుపాలని ఆదేశించారు. గాయపడిన విద్యార్థినిలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు చేపట్టాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు