Smita Sabharwal | బాలలత సవాల్‌కు స్మితా సై , మీ రిజర్వేషన్ ఫీల్డ్ వర్క్ కోసమా..కోచింగ్ సెంటర్ల కోసమా వాడారా ?

దమ్ముంటే తనతో పాటు సివిల్స్ పరీక్షలో పోటీ పడాలని మాజీ ఐఏఎస్‌, కోచింగ్ అకాడమీ చీఫ్ బాలలత విసిన సవాల్‌పై స్మితా సభర్వాల్ స్పందించారు. తాను బాలలత సవాల్‌ స్వీకరిస్తున్నానని.. కానీ తన వయస్సు దాటిపోవడంతో యూపీఎస్సీ నిబంధనలు ఒప్పుకోవని ట్వీట్ చేశారు

Smita Sabharwal | బాలలత సవాల్‌కు స్మితా సై , మీ రిజర్వేషన్ ఫీల్డ్ వర్క్ కోసమా..కోచింగ్ సెంటర్ల కోసమా వాడారా ?

విధాత, హైదరాబాద్ : దమ్ముంటే తనతో పాటు సివిల్స్ పరీక్షలో పోటీ పడాలని మాజీ ఐఏఎస్‌, కోచింగ్ అకాడమీ చీఫ్ బాలలత విసిన సవాల్‌పై స్మితా సభర్వాల్ స్పందించారు. తాను బాలలత సవాల్‌ స్వీకరిస్తున్నానని.. కానీ తన వయస్సు దాటిపోవడంతో యూపీఎస్సీ నిబంధనలు ఒప్పుకోవని ట్వీట్ చేశారు. అలాగే బాలలత నా ప్రశ్నకు సమాధానమివ్వాలని.. మీదివ్యాంగ రిజర్వేన్ ను ప్రజలకు ఫీల్డ్ వర్క్ కోసం వినియోగించారా.. లేక కోచింగ్ సంస్థలు నడిపేందుకు వాడారా అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. మరి ఈ ప్రశ్నకు సివిల్స్ మెంటర్ బాలలత ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. అంతకుముందు ఐఏఎస్ సర్వీస్‌లో దివ్యాంగుల కోటా అనవసరమంటూ ఐఏఎస్ స్మితా సభర్వాల్ చేసిన వ్యాఖ్యలపై బాలలత మండిపడ్డారు. సివిల్ సర్వీసెస్‌లో దివ్యాంగుల కోట అంశంపై స్పందించేందుకు కోర్టులు, చట్టసభలు ఉన్నాయంటూ ఆమె ఫైర్ అయ్యారు. ఇది స్మితా సబర్వాల్ ఆలోచనా… లేక తెలంగాణ ప్రభుత్వ ఆలోచన చెప్పాలని ప్రశ్నించారు. ఆమెపై మంగళవారంకల్లా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే స్మితా సబర్వాల్ దమ్ముంటే తనతో పాటు సివిల్స్‌ ఎగ్జామ్ లో పోటీ పడాలని సవాల్ విసిరారు.

ఇక బాల‌ల‌త త‌ర‌పున అధికార ప్ర‌తినిధిలా వ్య‌వ‌హ‌రిస్తున్న సుధాక‌ర్ ఉడుముల‌కు కూడా స్మితా స‌బ‌ర్వాల్ ఘాటైన ప్ర‌శ్న వేశారు. బాల‌ల‌త‌ డిజ‌బిలిటీ కోటాలో ఆమె త‌న ప్ర‌త్యేక హ‌క్కును దేనికి ఉప‌యోగించారు..? కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌ను న‌డిపేందుకా..? ఫీల్డ్ వ‌ర్క్ ద్వారా ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డానికా..? ఒక్క‌సారి అడ‌గాల‌ని సుధాక‌ర్ ఉడుముల‌ను ప్ర‌శ్నించారు.

దివ్యాంగుల‌కు ఐఏఎస్ లాంటి అత్యున్న‌త పోస్టుల్లో నియామ‌కానికి రిజ‌ర్వేష‌న్ ఎందుకని స్మితా స‌బ‌ర్వాల్ ప్ర‌శ్నించారు. క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌ల‌కు ఐఏఎస్ అధికారులు వెళ్లాల్సి వుంటుంద‌ని ఆమె పేర్కొన్నడం వివాదాస్ప‌ద‌మైంది. నిన్న‌టి నుంచి స్మితా స‌బ‌ర్వాల్‌పై ప‌లువురు మండిప‌డుతుండ‌గా, కొంద‌రేమో ఆమె వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థిస్తున్నారు. స్మితా స‌బ‌ర్వాల్ వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ ప్ర‌భుత్వ పెద్ద‌లు ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు.

ఎవరీ బాల‌ల‌త‌..?

మ‌ల్ల‌వ‌ర‌పు బాల‌ల‌త సొంతూరు గుంటూరు జిల్లాలోని ఓ ప‌ల్లెటూరు. ఆమె తండ్రి శౌర‌య్య జ‌ర్న‌లిస్టు. బాలలత మల్లవరపు 11 నెలల వయసు ఉన్న సమయంలో పోలియో చుక్కల ప్రభావంతో కాళ్లు కోల్పోయింది. శారీరక వైకల్యం కారణంగా చిన్నతనంలో పాఠశాలకు వెళ్లలేకపోయింది. అయితే బాలలత తల్లిదండ్రులు ఓ వైపు మెరుగైన చికిత్స అందిస్తూనే.. మరోవైపు ఇంట్లోనే చదువుకు బీజం చేశారు. 10, 12వ తరగతి బోర్డు పరీక్షలను ప్రైవేట్ గా రాసి ప్ర‌థ‌మ శ్రేణిలో ఉత్తీర్ణ‌త సాధించారు. అనంతరం న్యాయ విద్య‌ను అభ్య‌సించారు. తొలిసారి త‌న 22వ ఏట సివిల్స్ రాసి 399వ ర్యాంకు సాధించారు. ర‌క్ష‌ణ శాఖ‌లో డిప్యూటీ డైరెక్ట‌ర్ స్థాయిలో విధులు నిర్వ‌హించారు. అందుకే సర్వీసులో ఉన్నా కూడా మళ్లీ 2016లో సివిల్స్‌ రాసి 167వ ర్యాంకు సాధించారు. ఆ విజయంతో మెంటర్‌గా వ్యవహరించే అర్హత త‌న‌కుందని గట్టిగా నిర్ధారించుకున్న‌ట్లు ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 30 వేల మందికి సివిల్స్ ప‌రీక్ష‌ల కోసం శిక్షణ ఇచ్చిన‌ట్లు తెలిపారు. ఆమె ఆధ్వ‌ర్యంలో వంద‌ల మంది సివిల్స్ క్లియ‌ర్ చేసి ఐఏఎస్ ప‌ద‌వుల్లో ఆయా రాష్ట్రాల్లో ఉన్నారు.