Summer | ఉక్క‌పోత‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా..? హైద‌రాబాద్‌లోని ఈ 6 ప్రాంతాల‌కు వెళ్లండి మ‌రి..!

Summer | ఉక్క‌పోత‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా..? ఇంట్లో ఉండ‌లేక‌పోతున్నారా..? చ‌ల్ల‌ని గాలుల‌కు సేద‌తీరాల‌ని ఉందా..? అయితే ఆల‌స్య‌మెందుకు.. మ‌న హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌రంలోని ఈ పార్కుల్లో( Parks ) వాలిపోయి.. చ‌ల్ల‌ని గాలిని ఆస్వాదిద్దాం ప‌దండి..

Summer | ఉక్క‌పోత‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా..? హైద‌రాబాద్‌లోని ఈ 6 ప్రాంతాల‌కు వెళ్లండి మ‌రి..!

Summer | రాజ‌ధాని భాగ్య‌న‌గ‌రం( Bhagyanagaram )లో భానుడు( Sun ) త‌న ప్ర‌తాపం చూపిస్తున్నాడు. ఎండ‌లు( Summer ) దంచికొడుతున్నాయి. అధిక ఉష్ణోగ్ర‌త‌లు( Temperatures ) న‌మోదు అవుతుండ‌డంతో ఉక్క‌పోత కూడా తీవ్ర‌మైంది. ఉక్క‌పోత‌కు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఫ్యాన్లు, ఏసీలు కూడా స‌రిపోవ‌డం లేదు. చ‌ల్ల‌ని గాలి లేక పిల్ల‌లు, వృద్ధులు విల‌విల‌లాడిపోతున్నారు. అయితే ఈ ఉక్క‌పోత‌, ఎండ‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొందాలంటే.. పార్కుల‌కు( Parks ) వెళ్ల‌క త‌ప్ప‌దు. అదేదో సుదూర ప్రాంతాల్లోని పార్కుల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. మ‌న హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌రంలోనే ఉన్న పార్కుల‌కు వెళ్తే స‌రిపోతుంది. త‌క్కువ బ‌డ్జెట్‌తో ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణాన్ని పొందొచ్చు. మ‌రి హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఆ ఆహ్లాద‌క‌ర‌మైన పార్కులు( Parks ) ఏంటో చూసేద్దాం.

కేబీఆర్ పార్క్( KBR Park )

కేబీఆర్ పార్క్ ( KBR Park ).. ఇది జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉంది. కాసు బ్ర‌హ్మానంద రెడ్డి జాతీయ పార్కు 360 ఎక‌రాల్లో విస్త‌రించి ఉంది. ప‌చ్చ‌ని చెట్ల‌తో మంచి ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఇక్క‌డ 600 జాతుల మొక్క‌లు, 140 ర‌కాల ప‌క్షులు ఉన్నాయి. నెమ‌ళ్లు ఎంత‌గానో ఆక‌ర్షిస్తాయి. ఈ పార్కులో స‌ర‌దాగా వాకింగ్ చేయొచ్చు. యోగా కేంద్రాలు కూడా ఉన్నాయి.

గండిపేట ల్యాండ్‌స్కేప్ పార్క్( Gandipet Landscape Park )

గండిపేట ల్యాండ్‌స్కేప్ పార్కు ( Gandipet Landscape Park ) ఉస్మాన్ సాగ‌ర్‌( Osman Sagar )కు ద‌గ్గ‌ర్లో ఉంది. ఈ పార్కు 125 ఎక‌రాల్లో విస్త‌రించి ఉంది. ఈ ఎకో పార్కును 2022లో ప్రారంభించారు. వాకింగ్ చేసుకోవ‌చ్చు. ఆంపిథియేట‌ర్ ఉంది. ఫ్యామిలీస్‌కు ఈ పార్కు ఉత్త‌మంగా ఉంటుంది. చిన్న‌పిల్ల‌ల‌తో వెళ్లేవారు ఎంజాయ్ చేయొచ్చు.

ఫైక‌స్ గార్డెన్( Ficus Garden )

ఇది జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉంది. ప‌చ్చ‌ని పందిరిలా ఈ గార్డెన్ ప‌రుచుకుంది. సాయంత్రం వేళ ప్ర‌శాంతంగా ఉంటుంది. వైండింగ్ పాథ్స్, రాక్ ఫార్మెష‌న్స్ ఎంతో ఆక‌ట్టుకుంటాయి. వ్యూ దుర్గం చెరువును పోలి ఉంటుంది. న‌డ‌క‌కు, జాగింగ్‌కు ఇది ఎంతో అనువైన ప్ర‌దేశం.

లోట‌స్ పాండ్ ( Lotus Pond )

లోట‌స్ పాండ్( Lotus Pond ) ఫిల్మ్ న‌గ‌ర్‌లో ఉంది. ఈ పాండ్ చుట్టూ ప‌చ్చ‌ని చెట్లు ఉంటాయి. ఈ స‌ర‌స్సులో చేప‌లు, తాబేలు, బాతులు ప‌ర్యాట‌కుల‌కు క‌నువిందు క‌లిగిస్తాయి. 1.2 కిలోమీట‌ర్ల మేర వాకింగ్ ట్రాక్ ఉంటుంది. ఈవినింగ్ వేళ ఎంతో హాయిగా ఉంటుంది ఈ పార్కులో.

శామీర్‌పేట్ లేక్ ( Shamirpet Lake )

శామీర్‌పేట్ లేక్( Shamirpet Lake ) సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వెళ్లే మార్గంలో ఉంటుంది. ఔట‌ర్ రింగ్ రోడ్డుకు అవ‌త‌ల ఉంటుంది. నిజాం కాలంలో దీన్ని నిర్మించారు. పిక్నిక్స్‌కు, బోటింగ్‌కు శామీర్‌పేట్ లేక్ ఎంతో ప్ర‌సిద్ధి. ఇక్క‌డ ర‌క‌ర‌కాల ప‌క్షుల‌ను కూడా చూడొచ్చు. ఈ లేక్‌కు స‌మీపంలోనే జ‌వ‌హ‌ర్ డీర్ పార్కు( Jawahar Deer Park ) ఉంటుంది. వీకెండ్‌లో శామీర్‌పేట్ లేక్‌కు వెళ్ల‌డం ఎంతో అనుభూతిని ఇస్తుంది.

ఆక్సిజ‌న్ పార్క్ ( Oxygen Park )

కండ్ల‌కోయ వ‌ద్ద ఔట‌ర్ రింగ్ రోడ్డు స‌మీపంలో ఆక్సిజ‌న్ పార్కు( Oxygen Park )ను ఏర్పాటు చేశారు. ఇది 75 ఎక‌రాల్లో విస్త‌రించి ఉంది. బ‌యోడైవ‌ర్సిటీకి ఇది ప్ర‌సిద్ధి. వాకింగ్ జోన్ ఉంది. బ‌ట్ట‌ర్‌ఫ్లై పార్కు ప్ర‌త్యేకంగా ఉంది. మార్నింగ్ వాక్‌కు, యోగా చేసేందుకు ఈ ప్లేస్ సూప‌ర్బ్. ఫ్యామిలీస్ కూడా ఈ పార్కులో ఎంజాయ్ చేయొచ్చు.