జీహెచ్ఎంసీ పరిధిలో నేడు ఆటో, ట్యాక్సీ వాలాకు టీకా…
విధాత,హైదరాబాద్: రాష్ట్రంలో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా నేడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని డ్రైవర్లకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. రవాణాశాఖ ఆధ్వర్యంలో వీరికి ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకాల పంపిణీ కొనసాగనుంది . ఇందుకోసం జీహెచ్ఎంసీ పరిధిలో 10 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. . టీకాలు వేయించుకునే వారు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ జీరాక్స్ కాపీ తీసుకురావాలని అధికారులు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో […]

విధాత,హైదరాబాద్: రాష్ట్రంలో సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా నేడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని డ్రైవర్లకు కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు. రవాణాశాఖ ఆధ్వర్యంలో వీరికి ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకాల పంపిణీ కొనసాగనుంది . ఇందుకోసం జీహెచ్ఎంసీ పరిధిలో 10 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. . టీకాలు వేయించుకునే వారు ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ జీరాక్స్ కాపీ తీసుకురావాలని అధికారులు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 లక్షలకుపైగా ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఉన్నారని అధికారులు వెల్లడించారు.