పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త.. భారీగా నిధులు విడుదల

పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.104 కోట్లు విడుదల చేసింది.

పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త.. భారీగా నిధులు విడుదల

హైదరాబాద్, సెప్టెంబర్ (విధాత): తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త చెప్పింది. ఈ మేరకు ఒకేసారి భారీ మొత్తంలో నిధులను విడుదల చేసింది. పంచాయతీ కార్యదర్శుల బిల్లుల క్లియరెన్స్ కోసం ప్రభుత్వం రూ. 104 కోట్లు విడుదల చేసింది. దీంతో పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ అయ్యాయి. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క చొరవతో ఎప్పుడూ లేని విధంగా ఒకే విడతలో ఇంత పెద్ద మొత్తాన్ని విడుదల చేసింది. ఈ చర్యతో పంచాయతీ కార్యదర్శులపై ఉన్న ఒత్తిడి తగ్గి ఊరట లభించింది.

ఈ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ..

“పంచాయతీ కార్యదర్శుల సమస్యలు అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెంటనే స్పందించి రూ. 104 కోట్లు విడుదల చేశారు. ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి ఇంత పెద్ద మొత్తాన్ని విడుదల చేయడం పంచాయతీ వ్యవస్థ పటిష్టతకు దోహదం చేస్తుంది” అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలకు కృతజ్ఞతలు తెలిపారు.