Horoscope | సోమ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి అన‌వ‌స‌ర ధ‌న‌వ్య‌యం..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Horoscope | సోమ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి అన‌వ‌స‌ర ధ‌న‌వ్య‌యం..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మనోబలంతో చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. కీలక వ్యవహారాల్లో తోటివారి సూచనలు పనికి వస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరగవచ్చు. గ్రహసంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండాలి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శ్రమ, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఆలస్యం కావచ్చు. నిరాశావాదం వీడి సహనంతో ఉండాలి. ప్రయాణంలో ఆటంకాలు ఉండవచ్చు. కొత్తగా ఏ పనులు ఈ రోజు మొదలు పెట్టద్దు.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాల కారణంగా శ్రమ పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో క్రమశిక్షణతో మెలగాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచి తూచి నడుచుకోవాలి. ఖర్చులు పెరుగుతాయి. అనవసర ధనవ్యయం ఉండవచ్చు.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పట్టుదలతో వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. రచయితలకు, కళాకారులకు ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. మీ ప్రతిభకు గుర్తింపు, ప్రశంసలు అందుకుంటారు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఒక వార్త విచారం కలిగిస్తుంది. ఆర్థిక పరమైన ఆందోళనలతో మనశ్శాంతి లోపిస్తుంది. జీవిత భాగస్వామితో వాదనలు, ఘర్షణలు జరిగే అవకాశం ఉంది. భూమి, ఆస్తికి సంబంధించిన విషయాలతో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగులు అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తీర్థయాత్ర చేసే అవకాశం ఉంది. సన్నిహితులతో కొత్త ప్రదేశాల్లో పర్యటిస్తారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇంటా బయటా కలహాలు రాకుండా మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఖర్చుల విషయంలో తెలివిగా నడుచుకోండి. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మనోబలంతో చేపట్టిన పనుల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. సమాజంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ఖర్చులు అదుపులో ఉంచుకోండి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలకు ఆటంకాలు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. అనవసర వ్యయం పెరుగుతుంది. వాహనప్రమాద సూచన ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. లక్ష్యసాధనలో విజయం సాధిస్తారు. మీ శక్తియుక్తులతో వృత్తి పరమైన ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. పట్టుదలతో ప్రారంభించిన పనులు పూర్తి చేస్తారు. అదృష్టం అనుకూలంగా ఉంది కాబట్టి పట్టిందల్లా బంగారం అవుతుంది. కుటుంబ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. భూ, గృహ యోగాలున్నాయి. ఒక వ్యవహారంలో ధనలాభం ఉంటుంది.