మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై.. రాష్ట్రానికి మరోసారి లేఖ రాసిన కేంద్రం

విధాత: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై కేంద్రం మరోసారి రాష్ట్రానికి లేఖ రాసింది. ఈనెల21వ తేదీ సాయంత్రం మేడిగడ్డ బ్యారేజిలో భారీ శబ్దంతో బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన కుంగిపోయింది. దీనిపై స్పంధించిన కేంద్రం దసరా పండుగ తెల్లవారి మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు వచ్చింది. రెండు రోజులు రాష్ట్రంలో పర్యటించి ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించి ఢిల్లీకి వెళ్లింది.
బ్యారేజీని పరిశీలించి ఢిల్లీ వెళ్లిన బృందం ఇచ్చిన సమాచారం ఆధారంగా కేంద్రం మరిన్ని వివరాలు కావాలని మరోసారి లేఖ రాసింది. మొత్తం 20 అంశాల సమాచారాన్ని కోరింది. ఇప్పటి వరకు మూడు అంశాల వివరాలను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని మిగతా వివరాలు ఇవ్వాలని కేంద్ర అధికారులు రాష్ట్రాన్ని అడిగినట్లు సమాచారం.