Komati Reddy Rajagopal Reddy | కేసీఆర్ అసెంబ్లీకి వస్తేనే మజా..కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
మాజీ సీఎం, ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకపోతే కిక్కు లేదని, కేసీఆర్ సభకు వస్తేనే మజా ఉంటదని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

బీఆరెస్ సభ్యులు తల్లిలేని పిల్లలయ్యారు
విధాత, హైదరాబాద్ : మాజీ సీఎం, ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకపోతే కిక్కు లేదని, కేసీఆర్ సభకు వస్తేనే మజా ఉంటదని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం శాసన సభ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ సభకు రాకపోవడంతో బీఆరెస్ సభ్యులు తల్లి లేని పిల్లలుగా మారిపోయారని వ్యాఖ్యానించారు. తప్పుడు నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్స భలో ఉంటే సమాధానం చెప్పాల్సి వచ్చేదని, నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ సభలో లేనప్పుడు ఎన్ని మాట్లాడినా…అనుకున్న ఫలితం ఉండదన్నారు. పవర్ మీద డిస్కషన్ లో కేసీఆర్ ఉండి ఉంటే ఇంకా బాగా జరిగేదని, కేసీఆర్ ఓడిపోయినా ఆయన ఇంకా రాష్ట్రానికి జాతిపిత అనుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. బీఆరెస్ అధికారంలో ఉన్న పదేళ్లు ఆ పార్టీ ఎమ్మెల్యేల కేసీఆర్‌ను జాతిపిత అని పొగిడి, అతన్ని ఆకాశంలో కూర్చోబెట్టారన్నారు. అధికారం పోయిన తర్వాత కూడా కేసీఆర్ ఇంకా అదే ఊహల్లో ఉన్నాడని విమర్శించారు. హరీష్ రావు మంచి వర్కర్, వక్త అని, అయితే ఆయనకు ప్రతిపక్ష నేత ఇవ్వరని ఎద్దేవా చేశారు. హరీష్ రావు, కేటీఆర్‌లలో ఎవరికి పగ్గాలు ఇచ్చినా పార్టీ అగమవుతుందన్నారు. పదేళ్లలో బీఆరెస్ సర్కార్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. ఎంత దోపిడీ చేయాలో అంత దోపిడీ చేశారని ఆరోపించారు. బీఆరెస్ పాలనలో వారు చేసిన తప్పులు ఎక్కడ బయటపడతాయో అని అసెంబ్లీలో గందరగోళం సృష్టిస్తున్నారని, తమ ప్రసంగాలతో ప్రజల దృష్టిని, సభను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. మహిళ సెంటిమెంట్ వాడుతున్న వారు గౌరవంగా ఉండాలి కదా అని, పార్టీ మారి ఉండాల్సింది కాదు కదా అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఒకవేళ పార్టీ మారే వారు రాజీనామా చేసి వెళ్లాలని, పార్టీలో అన్ని పదవులు అనుభవిoచి… కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా వెళతారని విమర్శించరు. సభలో ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్ లు చేయకపోవడమే మా ప్లాన్ అని, కాంగ్రెస్ చాలా టఫ్‌గా ఉంటదని చెప్పారు.