Telangana Assembly | విద్యార్హతలపై సీఎం రేవంత్‌రెడ్డి వర్సెస్ కేటీఆర్‌ల మాటల యుద్ధం

శాస‌న‌స‌భ‌లో ద్రవ్య వినియ‌మ బిల్లుపై చర్చలో కేటీఆర్ ఉద్యోగాల కల్పన, పాలసీల రూపకల్పనలపై ప్రభుత్వంపై విమర్శలు చేసిన క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి విద్యార్హతపై వ్యాఖ్యలు చేయడంతో ప్రతిగా సీఎం రేవంత్‌రెడ్డి సైతం కౌంటర్ వేయడం కొంత రచ్చ రేపింది.

Telangana Assembly | విద్యార్హతలపై సీఎం రేవంత్‌రెడ్డి వర్సెస్ కేటీఆర్‌ల మాటల యుద్ధం

విధాత, హైదరాబాద్ : శాస‌న‌స‌భ‌లో ద్రవ్య వినియ‌మ బిల్లుపై చర్చలో కేటీఆర్ ఉద్యోగాల కల్పన, పాలసీల రూపకల్పనలపై ప్రభుత్వంపై విమర్శలు చేసిన క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి విద్యార్హతపై వ్యాఖ్యలు చేయడంతో ప్రతిగా సీఎం రేవంత్‌రెడ్డి సైతం కౌంటర్ వేయడం కొంత రచ్చ రేపింది. సీఎం రేవంత్ రెడ్డి పాల‌సీలు తెస్తామ‌న్నారు కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క కొత్త పాల‌సీ తేలేదని, కేసీఆర్ అంటే జ‌ల‌సీ త‌ప్ప‌.. ఏ పాల‌సీ తేలేదన్నారు. మ‌హేశ్వ‌రంను న్యూయార్క్‌లా, మూసీని లండ‌న్ థేమ్స్ న‌దిలా మారుస్తాం అని రేవంత్ రెడ్డి అన్నారన్నారు. ఇక ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ అన్నారని. ఎవ‌రి ఇంటెలిజెన్స్ ఏంటో ప్ర‌జ‌లు తేల్చుతారని, నేను చ‌దువుకుని వ‌చ్చానని, నేను రెండు మాస్ట‌ర్ డిగ్రీలు చ‌దివానని, పుణెలో మాస్ట‌ర్స్‌లో బయోటెల‌క్నాల‌జీ చేశానని, న్యూయార్క్ వెళ్లి ఎంబీఏ చేశానని, గుంటూరులో కూడా ఇంట‌ర్ చ‌దివానని, అంత‌టా చ‌దివానని, స‌ర్టిఫికెట్లు చూపే ప‌రిస్థితి నాకుందన్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి రు ఎక్క‌డ చ‌దువుకున్నారో, ఏం చ‌దువుకున్నారో నాకైతే తెల్వ‌దని, నేనైతే క‌ష్ట‌ప‌డ్డాను.. ఉద్యోగం సంపాదించానని, అదే ఉద్యోగం మీద ఇండియాకు వ‌చ్చానని, మ‌రి నాకు ఇంటెలిజెన్స్ ఉందా లేదా అంటే నేను పోటీ ప‌రీక్ష‌లు రాశానని, ఇంట‌ర్వ్యూలు అటెండ్ అయ్యానని చెప్పారు. ముఖ్య‌మంత్రి గ‌తం గురించి నాకు తెల్వ‌దు కానీ ఆయ‌న గురించి ర‌క‌ర‌కాలుగా చెప్తారని, ఎవ‌రి ఇంటెలిజెన్స్ ఏందో అంద‌రూ విన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ప‌దేండ్ల క్రితం రేవంత్ మంచి స్నేహితులమని, ఇక రేవంత్ రెడ్డి చాలా అదృష్ట‌వంతులు. చిన్న వ‌య‌సులోనే సీఎం అయ్యారని, ఆయ‌న గురించి గొప్ప‌గా చెబుతున్నానని, రేవంత్ రెడ్డి దాదాపు 18 ఏండ్ల నుంచి నాకు తెలుసని, మంచి మిత్రులు.. చాలాసార్లు బ‌య‌ట మాట్లాడుకున్నామని,గ‌త 10 ఏండ్ల‌లో చెడింది.. అదే వేరే విష‌యం అని కేటీఆర్ తెలిపారు. ఈ క్ర‌మంలోనే సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని.. నేను కొండారెడ్డిప‌ల్లి, తాండ్ర‌, వ‌న‌ప‌ర్తి, హైద‌రాబాద్‌లో ప్ర‌భుత్వ విద్య అభ్య‌సించాను. నేనేం జ్ఞానం కోసం ప‌క్క రాష్ట్రాల‌కు పోలేదు. గుంటూరు కూడా పోలేదు. 610 జీవో, ముల్కీ రూల్స్ అప్లై చేసినా.. తెలంగాణ‌లోని ప్ర‌తి ఉద్యోగానికి నాకు అర్హ‌త ఉందంటూ, మ‌రి గుంటూరులో చ‌దువుకున్న వారికి అర్హ‌త ఉందో లేదో తెలియదు అని రేవంత్ కేటీఆర్‌కు కౌంటర్ వేశారు. సీఎం వ్యాఖ్యలపై మళ్లీ స్పందించిన కేటీఆర్ తాను గుంటూరులో 11, 12 చ‌దివాను. విజ్ఞాన్‌లో చ‌దివాను అనే విష‌యం చెబుతూనే ఉన్నానని దాచడం లేదని, ప్ర‌యివేటు రంగంలో ఉద్యోగాల‌కు 610 జీవో, ముల్కీ రూల్స్ అవ‌స‌రం లేద‌ని, అవి కేవ‌లం ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తాయ‌న్నారు.