వెంకటరెడ్డికి చేదు అనుభవం.. నల్గొండ ప్రచారంలో అడ్డుకున్న యువకులు

వెంకటరెడ్డికి చేదు అనుభవం.. నల్గొండ ప్రచారంలో అడ్డుకున్న యువకులు
  • ఆలయంలోకి వెళ్లకుండానే వెనుతిరిగిన వైనం


విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి శనివారం నల్గొండ పట్టణంలో చేదు అనుభవం ఎదురైంది. నాలుగున్నర సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని పట్టించుకోలేదంటూ పలువురు స్థానిక యువకులు నిలదీశారు. కేవలం ఎన్నికల సమయంలోనే వచ్చి హడావుడి చేయటాన్ని తప్పుపడ్డారు. పట్టణంలోని దేవరకొండ రోడ్డులో ప్రచారంలో భాగంగా దుర్గా మాతను దర్శించుకుని పూజలు జరిపేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చారు.


స్థానిక యువకుడు మాతంగి అమర్ ఆధ్వర్యంలో అభ్యంతరం చెప్పారు. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్డు పైనుంచి దూరంగా దుర్గామాతకు దండం పెట్టి వెనుతిరిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాలుగున్నర ఏండ్లలో ఎప్పుడూ కూడా నియోజకవర్గంలో అడుగుపెట్టలేదని అన్నారు. ఎన్నికలు వచ్చేసరికి మంది, మార్బలంతో ప్రచారం నిర్వహించడాన్ని వారు ఖండించారు. కేవలం పదవిపై ఉన్న మమకారం ప్రజలపై లేకపోవడం విచారకరమన్నారు.