తెలంగాణలో క‌లెక్ట‌ర్లు రాజ‌కీయ‌నేత‌ల‌య్యారు : రేవంత్

విధాత‌: ధాన్యం కొనుగోళ్లపై తెరాస, భాజపా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆ రెండు పార్టీలు తోడు దొంగలని ధ్వజమెత్తారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజా చైతన్య యాత్రను రద్దు చేయలేదని.. వాయిదా వేశామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో జిల్లా కలెక్టర్లు రాజకీయ నేతల అవతారం ఎత్తారని ఆక్షేపించారు.  తెరాస ధర్నాలకు అనుమతులిస్తున్నారని.. తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నిబంధనలు కాంగ్రెస్‌కేనా.. తెరాస, భాజపాలకు వర్తించవా? అని […]

తెలంగాణలో క‌లెక్ట‌ర్లు రాజ‌కీయ‌నేత‌ల‌య్యారు : రేవంత్

విధాత‌: ధాన్యం కొనుగోళ్లపై తెరాస, భాజపా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆ రెండు పార్టీలు తోడు దొంగలని ధ్వజమెత్తారు. గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజా చైతన్య యాత్రను రద్దు చేయలేదని.. వాయిదా వేశామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో జిల్లా కలెక్టర్లు రాజకీయ నేతల అవతారం ఎత్తారని ఆక్షేపించారు.

తెరాస ధర్నాలకు అనుమతులిస్తున్నారని.. తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నిబంధనలు కాంగ్రెస్‌కేనా.. తెరాస, భాజపాలకు వర్తించవా? అని రేవంత్‌ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా తెరాస చేపట్టిన ధర్నాలో సీఎం కేసీఆర్‌ ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. రైతుల కోసం దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆయన ధర్నా చేయాలని డిమాండ్‌ చేశారు. ధనిక రాష్ట్రం ధాన్యం కొనుగోలు చేయలేదా? ధాన్యం కొనని పార్టీలకు ఓటెందుకు వేయాలని రేవంత్‌ ప్రశ్నించారు. ప్రత్యేక బడ్జెట్‌ పెట్టి ధాన్యం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.