కేటీఆర్‌ హోష్‌లో ఉండే ట్వీట్‌ చేశారా..?

విధాత‌: తెలంగాణలో జరుగుతున్న అత్యాచారాలకు మద్యమే కారణమని.. వ్యసనపరులకు తెలంగాణ స్వర్గధామమని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో మద్యం అమ్మకాలు రెట్టింపయ్యాయన్నారు. సైదాబాద్‌ బాధితులకు న్యాయం చేయాలని మంత్రి కేటీఆర్‌ ఐదు రోజుల కిందే ట్వీట్‌ చేశారన్నారు. ఐదు రోజుల తర్వాత నిందితుడు దొరకలేదని పోలీసులు చేతులెత్తేశారని రేవంత్ పేర్కొన్నారు. నిందితుడిని అరెస్ట్‌ చేశామని కేటీఆర్‌కు ఏ అధికారి సమాచారం ఇచ్చారని ప్రశ్నించారు. తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారిని ఎందుకు బర్తరఫ్‌ చేయలేదని ప్రశ్నించారు. మంత్రి […]

కేటీఆర్‌ హోష్‌లో ఉండే ట్వీట్‌ చేశారా..?

విధాత‌: తెలంగాణలో జరుగుతున్న అత్యాచారాలకు మద్యమే కారణమని.. వ్యసనపరులకు తెలంగాణ స్వర్గధామమని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో మద్యం అమ్మకాలు రెట్టింపయ్యాయన్నారు. సైదాబాద్‌ బాధితులకు న్యాయం చేయాలని మంత్రి కేటీఆర్‌ ఐదు రోజుల కిందే ట్వీట్‌ చేశారన్నారు. ఐదు రోజుల తర్వాత నిందితుడు దొరకలేదని పోలీసులు చేతులెత్తేశారని రేవంత్ పేర్కొన్నారు. నిందితుడిని అరెస్ట్‌ చేశామని కేటీఆర్‌కు ఏ అధికారి సమాచారం ఇచ్చారని ప్రశ్నించారు. తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారిని ఎందుకు బర్తరఫ్‌ చేయలేదని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్‌ హోష్‌లో ఉండే ట్విట్‌ చేశారా? అని ప్రశ్నించారు. ఉదయం 5 గంటల వరకు పబ్‌లు నడుస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మీ దగ్గరి బంధువులే పబ్‌లు నడుపుతున్నారన్నారు. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో విచారణ ఏమైందని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.