TELANGANA | తెలంగాణలో 8మంది ఐఏఎస్‌ల బదిలీ

: తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. వికాస్ రాజ్‌ను స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ప్రభుత్వం తిరిగి నియమించింది

TELANGANA | తెలంగాణలో 8మంది ఐఏఎస్‌ల బదిలీ

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. వికాస్ రాజ్‌ను స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ప్రభుత్వం తిరిగి నియమించింది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టి.కే.శ్రీదేవిని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. రిజ్వీకి వాణిజ పన్నుల శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. విపత్తుల నిర్వహణ విభాగం సంయుక్త కార్యదర్శిగా ఎస్. హరీశ్‌కు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఉదయ్ కుమార్‌కు మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పజెప్పారు. పురపాలక శాఖ ఉప కార్యదర్శిగా ప్రియాంక, హెచ్ఎసీఏ ఎండీగా చంద్రశేఖర్ రెడ్డి, మార్క్‌ఫెడ్‌ ఎండీగా శ్రీనివాస్ రెడ్డిలను ప్రభుత్వం నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.