మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్‌.. ఆ టికెట్ల జారీ నిలిపివేసిన ఆర్టీసీ..!

మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల రద్దీ పెరిగింది. నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రస్తుతం జారీ చేస్తున్న ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను ఉపసంహరించాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది

మహాలక్ష్మి పథకం ఎఫెక్ట్‌.. ఆ టికెట్ల జారీ నిలిపివేసిన ఆర్టీసీ..!

మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల రద్దీ పెరిగింది. నేపథ్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రస్తుతం జారీ చేస్తున్న ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను ఉపసంహరించాలని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఆయా టికెట్ల జారీని రేపటి (జనవరి 1, 2024) నుంచి పూర్తిగా నిలిపివేసింది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ధ్రువీకరించారు. ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశారు. ఫ్యామిలీ-24, టీ-6 టికెట్ల జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూసి.. వయసును నమోదు చేయాల్సి ఉంటుందని సజ్జనార్‌ తెలిపారు. మహాలక్ష్మీ స్కీమ్‌తో ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టీ-6 టికెట్ల జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోందన్నారు. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం పెరుగుతుందన్నారు. ప్రయాణికులకు ఆ సౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశంతో ఫ్యామిలీ-24, టీ-6 టికెట్ల జారీని నిలిపివేయాలని సంస్థ నిర్ణయించిందని తెలిపారు. టికెట్ల జారీని జనవరి ఒకటో తేదీ నుంచి జారీ చేయబోవడం లేదని వివరించారు.