ఉత్తమ్, కోమటిరెడ్డి బిగ్ ఆపరేషన్
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డిలు బీఆరెస్‌కు బిగ్ షాక్ ఇచ్చారు. బీఆరెస్ నుండి కోదాడ, నల్లగొండ, నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లోని కీలక నేతలను కాంగ్రెస్‌లో చేర్చడంలో విజయవంతమయ్యారు

- కోదాడ, నల్లగొండ, సాగర్‌లలో కాంగ్రెస్‌లోకి భారీ వలసలు
విధాత, ఉమ్మడి నల్లగొండ బ్యూరో : పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు బీఆరెస్‌కు బిగ్ షాక్ ఇచ్చారు. బీఆరెస్ నుండి కోదాడ, నల్లగొండ, నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లోని కీలక నేతలను కాంగ్రెస్‌లో చేర్చడంలో విజయవంతమయ్యారు. భారీ స్థాయిలో జరిగిన ఈ వలసలు ఆ నియోజకవర్గాల్లో సిటింగ్ బీఆరెస్ ఎమ్మెల్యేలకు షాక్ నిచ్చేదిగా కనిపిస్తున్నాయి. కోదాడలో ఉత్తమ్ స్వయంగా బీఆర్‌ఎస్ నేతలు మాజీ ఎమ్మెల్యే వేనెపల్లి చందర్‌రావు, నియోజకవర్గం బీఆరెస్ ఇంచార్జీ కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు సహా సిటింగ్ బీఆరెస్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యపై వ్యతిరేకంగా ఉన్న బీఆరెస్ నేతలతో భేటీ అయ్యారు. వారిని సాదరంగా కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.

నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో సిటింగ్ బీఆరెెస్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిని వ్యతిరేకించిన మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్‌గౌడ్, తన మద్ధతుదారులైన 10మంది కాంగ్రెస్ కౌన్సిలర్లతో కలిసి మాజీ మంత్రి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. రమేశ్‌గౌడ్‌తో పాటు కౌన్సిలర్లు ఖయ్యుంబేగ్, ప్రదీప్ నాయక్, రిపోతుల అశ్విని భాస్కర్‌గౌడ్, ప్పు సాయిశ్రీ సందీప్ సహా 10మంది కౌన్సిలర్లు, రాష్ట్ర హౌజ్ కమిటీ సభ్యుడు అజీజుద్దిన్ బషీర్, రామలింగాలగూడెం ఎంపీటీసీ ముత్తినేని అనూషా, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు కాంగ్రెస్‌లో చేరారు.
ఇక నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సిటింగ్ బీఆరెస్ ఎమ్మెల్యే నోముల భగత్‌పై అసంతృప్తితో ఉన్న గుర్రంపోడు జడ్పీటీసీ గాలి రవికుమార్, 10మంది సర్పంచ్‌లు, 12మంది మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు.