విధాత:ఒక మహిళగా ఛాలెంజ్ చేస్తున్నా.అక్రమాలు జరిగినట్లు నిరూపించాలి.సమైక్యాంధ్రలో ఆత్మ గౌరవంతో బ్రతికినం. 2014 నుంచి ఆ పరిస్థితులు లేవు.గేట్ వద్దే మూడు సార్లు అపాయింట్మెంట్ లేదని ఆపితే ఈటెల ఇంటికి వచ్చి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి.ఉద్యమంలో ఈటల పెట్టిన డబ్బుల గురించి ఎవరైనా ఆడిగారా..?నేను వ్యాపారం చేస్తూ ఈటెలను ఉద్యమంలోకి పంపాను.నా వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా ఉద్యమంలో ఈటెల అందరిని కాపాడుకున్నారు. ఈటెల ఉద్యమంలో ఎలా ఉన్నాడో ఓయూ విద్యార్థులను అడగండి.నా ఆస్తులు అమ్మి […]
విధాత:ఒక మహిళగా ఛాలెంజ్ చేస్తున్నా.అక్రమాలు జరిగినట్లు నిరూపించాలి.సమైక్యాంధ్రలో ఆత్మ గౌరవంతో బ్రతికినం. 2014 నుంచి ఆ పరిస్థితులు లేవు.గేట్ వద్దే మూడు సార్లు అపాయింట్మెంట్ లేదని ఆపితే ఈటెల ఇంటికి వచ్చి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి.ఉద్యమంలో ఈటల పెట్టిన డబ్బుల గురించి ఎవరైనా ఆడిగారా..?నేను వ్యాపారం చేస్తూ ఈటెలను ఉద్యమంలోకి పంపాను.నా వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా ఉద్యమంలో ఈటెల అందరిని కాపాడుకున్నారు.
ఈటెల ఉద్యమంలో ఎలా ఉన్నాడో ఓయూ విద్యార్థులను అడగండి.నా ఆస్తులు అమ్మి ఐనా సరే మా ఆయనకు అండగా ఉంటా.తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటంలో ఎంతకైనా సిద్ధమే.నయీమ్ చంపుతాను అంటే భయపడలేదు.ఉమ్మడి రాష్ట్రంలో ఈటెల కు జ్వరం వస్తే అప్పటి పాలకులు వచ్చి పరామర్శించారు.తెలంగాణ వచ్చాక ఆ పరిస్థితి లేదు.అధికారం ఉందని ఎం చేసినా చెల్లుతుందని అనుకుంటే పోరపాటు.వైఎస్సార్ పార్టీలోకి ఆహ్వానిస్తేనే వెళ్లని వ్యక్తిత్వం.వకులాభారణం మొహం చూసి ఒక్క వోట్ పడతదా!అన్నా అని బతిలాడితే బీసీ కమిషన్ లో సభ్యుడిగా నియామకం జరిగేలా చేశారు.
నా ఇంట్లో అన్నం తిన్న వాళ్ళతోనే తిట్టిస్తున్నారు.ఉద్యమంలో ఈటెల రెండు మూడు రోజులు ఇంటికి రాకపోయినా కూడా దైర్యంగా ఉన్నాం.తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు లేవు.ఉద్యమంలోకి రాక ముందు కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంత..? ఇప్పుడు ఎంత..? చర్చకు సిద్ధమేనా?పోలీసులు మా కుటుంబం కోసమే పని చేస్తున్నారా? సమైక్య పాలనలో కూడా ఇన్ని ఇబ్బందులు లేవు.ఇప్పుడు రెడ్డి-ముదిరాజ్ లమని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా..?కులాల పేరుతో పాలన చేస్తున్నారు” అని ఈటల జమున నిప్పులు చెరిగారు.