ఆరు గ్యారంటీలపై ఎన్నం ప్రచారం

ఆరు గ్యారంటీలపై ఎన్నం ప్రచారం

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలపై ఆ పార్టీ నేత ఎన్నం శ్రీనివాస్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఆదివారం పాలమూరు నియోజకవర్గంలోని ఎదిర గ్రామంలో ఆయన పర్యటించారు. పార్టీ ప్రచారానికి గ్రామస్థుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సందర్భంగా ఎన్నం మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం మోసకారి హామీలు ఇచ్చిందని విమర్శించారు.


పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అరకొర ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. అవి కూడా గులాబీ నాయకులకే కట్టబెట్టి పేదలకు అన్యాయం చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేసి పేదలను ఆదుకుంటామని ఎన్నం పేర్కొన్నారు. ఆరు గ్యారంటీ పథకాలు పేదలకు తప్పకుండా అందుతాయన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు అమరేందర్, సిరాజ్ ఖాద్రి, బెనహర్ ఉన్నారు.