VishwakSen | నేనేం బిర్యానీని కాదు.. ‘బేబీ’కి ‘నో’ చెప్పడంపై విశ్వక్ శేన్‌ క్లారిటీ! అల్లు అర్జున్‌కు కౌంటర్‌

VishwakSen | ‘బేబీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయదుంధుబి మోగిస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు వర్షాలు పడుతున్నా.. విజయపరంపర మాత్రం అస్సలు ఆగడం లేదు. అయితే ఈ సినిమా ఎంత సక్సెస్ సాధిస్తుందనే విషయం పక్కన పెడితే.. ఇంత పెద్ద సక్సెస్ అయిన సినిమాని వదులుకున్న హీరో ఎవరా? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమా కథ చెప్పడానికి ఓ హీరో దగ్గరకు వెళితే.. అతను అసలు వినకుండా పంపించివేశాడని.. ‘బేబీ’ దర్శకుడు, నిర్మాత.. అలాగే […]

VishwakSen | నేనేం బిర్యానీని కాదు.. ‘బేబీ’కి ‘నో’ చెప్పడంపై విశ్వక్ శేన్‌ క్లారిటీ! అల్లు అర్జున్‌కు కౌంటర్‌

VishwakSen |

‘బేబీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయదుంధుబి మోగిస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు వర్షాలు పడుతున్నా.. విజయపరంపర మాత్రం అస్సలు ఆగడం లేదు. అయితే ఈ సినిమా ఎంత సక్సెస్ సాధిస్తుందనే విషయం పక్కన పెడితే.. ఇంత పెద్ద సక్సెస్ అయిన సినిమాని వదులుకున్న హీరో ఎవరా? అని అంతా ఆశ్చర్యపోతున్నారు.

ఈ సినిమా కథ చెప్పడానికి ఓ హీరో దగ్గరకు వెళితే.. అతను అసలు వినకుండా పంపించివేశాడని.. ‘బేబీ’ దర్శకుడు, నిర్మాత.. అలాగే రీసెంట్‌గా జరిగిన అభినందన సభలో అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎవరా హీరో? అని అంతా సెర్చింగ్ మొదలెట్టారు. ఆ హీరో ఎవరో కాదు.. మాస్ కా దాస్ విశ్వక్‌సేన్. ఈ విషయమై తాజాగా ఆయన అటెండ్ అయిన ‘పేకమేడలు’ సినిమా ఈవెంట్‌లో క్లారిటీ ఇచ్చారు.

‘‘పెద్ద హీరోలం, చిన్న హీరోలం కాకపోయినా.. కొన్ని కొన్ని సినిమాలతో బిజీగా ఉంటాం. ఏం చేయాలో క్లారిటీ ఉన్నప్పుడు ఎదుటివాళ్ల టైమ్ వేస్ట్ చేయకూడదని అనుకుంటాం. అలాంటి సందర్భంలో కలవం.. వినం అని కొందరికి చెబుతుంటాం. దీనికి కూడా కొందరు ఫీల్ అవుతున్నారు.. అందుకు నేనేం చేయలేను. ఎందుకంటే అందరినీ హ్యాపీ చేయడానికి నేనేం బిర్యానీని కాదు.

ఇంకో విషయం ఏమిటంటే.. మన సినిమా బాగా నడిస్తే.. తలెత్తుకోవాలి. తప్పులేదు. తెలుగులో ఏ సినిమా హిట్టయినా.. ఏడ్చే వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. మ్యాగ్జిమమ్ మెంబర్స్ అబ్బా.. హిట్ వచ్చిందిరా అని సంతోషిస్తాం. అది కూడా ఒక చిన్న సినిమాగా మొదలై.. పెద్ద హిట్టయిందంటే అందరం ఆనందపడే విషయమది. దానికి నేను కంగ్రాచ్యులేట్ కూడా చేశాను.

వాట్సప్‌లో డైరెక్టర్స్‌కి ఒక గ్రూప్ ఉంది. అందులో నాకు కూడా చోటిచ్చారు. ఆ సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు ట్రైలర్ చాలా బాగుందని మెసేజ్ చేసిన ఫస్ట్ వ్యక్తిని నేనే. సడెన్‌గా కలవలేదు.. వినలేదు అని రాతలు, మీమ్స్ చూశాను.

ఒకరిని పిలిచి.. వాళ్లు చెప్పేది ఓ గంట సేపు విని ‘నో’ చెప్పడం కంటే.. ముందే ‘నో’ చెప్పాలని చెప్పినా. అది నా పర్సనల్ ఛాయిస్. ఆ సినిమా బాగాలేదు అని కాదు. నేను చేద్దామని అనుకున్న సినిమానే. కంగ్రాచ్యులేషన్స్ ఆ సినిమాకి.

కాకపోతే మన సినిమా బాగుంటే.. తలెత్తుకోవాలి తప్పులేదు. మన సినిమా బాగుందని ఎవరినీ కించ పరచవద్దు. అదొక్కటి బాధనిపించింది. అన్ని సినిమాలు బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను..’’ అంటూ విశ్వక్‌సేన్ తనపై వైరల్ అవుతున్న వార్తలకు క్లారిటీ ఇచ్చారు.