Origin Dairy | ఆరిజన్ డెయిరీ MD శేజల్ ఆత్మహత్యాయత్నం

Origin Dairy | విధాత‌: బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అతని అనుచరులు తనను మానసికంగా వేధిస్తున్నారని గత కొంతకాలంగా ఢిల్లీలో ఆందోళ‌న చేస్తున్న ఆరిజన్ డైరీ డైరెక్టర్ శేజల్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారు. మార్ఫింగ్ ఫోటోలతో సోషల్ మీడియాలో త‌న‌పై అసత్య ప్రచారం చేస్తున్నారని శేజల్ సూసైడ్ లేఖ‌లో పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరులైన భీమగౌడ్, చిల్లర సంతోష్, కుమ్మరి పోచన్న, కోణంగి కార్తికు లు మానసికంగా హింసిస్తున్నారని […]

Origin Dairy | ఆరిజన్ డెయిరీ MD శేజల్ ఆత్మహత్యాయత్నం

Origin Dairy |

విధాత‌: బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అతని అనుచరులు తనను మానసికంగా వేధిస్తున్నారని గత కొంతకాలంగా ఢిల్లీలో ఆందోళ‌న చేస్తున్న ఆరిజన్ డైరీ డైరెక్టర్ శేజల్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారు. మార్ఫింగ్ ఫోటోలతో సోషల్ మీడియాలో త‌న‌పై అసత్య ప్రచారం చేస్తున్నారని శేజల్ సూసైడ్ లేఖ‌లో పేర్కొన్నారు.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరులైన భీమగౌడ్, చిల్లర సంతోష్, కుమ్మరి పోచన్న, కోణంగి కార్తికు లు మానసికంగా హింసిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వానికి న్యాయమూర్తులకు పోలీసులకు సూసైడ్ నోట్‌లో పేర్కొంది.

నేను మృతి చెందిన తర్వాతనైనా వారికి శిక్ష పడాలని నాకు న్యాయం జరగాలని కోరింది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను చంపుతానని బెదిస్తున్నాడని అలాగే అతని అనుచరులు తనపై సోషల్ మీడియాలో అసభ్యకర వాక్యాలతో అవమానపరుస్తున్నారని ఆ అవమానాన్ని భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆరిజన్ డైరీ డైరెక్టర్ శేజల్ లేఖలో పేర్కొన్నారు.

గోలి శివకుమార్ అని దుర్గం చిన్నయ్య మరో అనుచరుడు తనను చంపుతానని బెదిరిస్తున్నాడని దుర్గం చిన్నయ్య అనుచరులు సంపుతానని బెదిరించినప్పటికీ నేను వారిపై పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంలేదని సూసైడ్ నోట్లో ఆవేదన వ్యక్తం చేసింది.