IRCTC Ooty Tour | ఎండల్లో చల్లచల్లటి ఊటీని చుట్టేద్దామా..? స్పెషల్‌ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ..!

IRCTC Ooty Tour | ఎండాకాలం వచ్చేసింది. ఓ వైపు ఎండలు మండుతున్నాయి. చల్లటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలని భావించే వారి కోసం ఐఆర్‌సీటీసీ సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. ఎర్రటి ఎండాకాలంలో చల్లటి ఊటీలో పర్యటనించేందుకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. అయితే, ఈ ప్యాకేజీని ఏపీలోని తిరుపతి నుంచి ఆపరేట్‌ చేస్తున్నది. ఆరు రోజుల పాటు ప్యాకేజీలో టూర్‌ కొనసాగనున్నది. అల్టిమేట్‌ ఊటీ ఎక్స్‌ తిరుపతి (SHR095) పేరిట ప్యాకేజీని తీసుకువచ్చింది. ప్రతి మంగళవారం ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.

ప్యాకేజీ వివరాలు ఇవి..

సమ్మర్‌లో ఊటీ వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ క్రమంలో ఊటీకి చాలామంది వస్తుంటారు. ఈ క్రమంలో ఊటీని చూసేందుకు వెళ్లేవారి కోసం ఐఆర్‌సీటీసీ ఈ ప్యాకేజీని తీసుకువచ్చింది. ప్యాకేజీ తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి అందుబాటులో ఉంటుంది. ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. ప్యాకేజీలో భాగంగా ఐదు రోజులు, ఆరు రాత్రులు పర్యటన కొనసాగుతుంది. తొలిరోజు తిరుపతి నుంచి రాత్రి 11.55 గంటలకు శబరి రైలు (17230)లో ఎక్కాల్సి ఉంటుంది. మరుసటి రోజు ఉదయం 8.02 గంటలకు కోయంబత్తూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఊటీకి వెళ్తారు. అదే రోజు మధ్యాహ్నం బోటానికల్ గార్డెన్‌ని సందర్శిస్తారు. ఆ త‌ర్వాత అక్కడే ఉన్న ఊటీ లేక్‌ను సంద‌ర్శిస్తారు. మూడో రోజు ఉదయం అల్పాహారం ముగిసిన తర్వాత దొడ్డబెట్ట శిఖరం, టీ మ్యూజియం, పైకార ఫాల్స్‌ను సందర్శిస్తారు. రాత్రి ఊటీలోనే బస ఉంటుంది. నాలుగోరోజు టిఫిన్ ముగిసాక ఊటీ నుంచి కున్నూరుకు ప్రయాణం ఉంటుంది. అక్కడ పర్యాటక ప్రాంతాలను వీక్షించిన అనంతరం ఊటికి బయలుదేరి వెళ్తారు. ఐదోరోజు కోయంబత్తూరుకు తిరుగుప్రయాణమవుతారు. శబరి రైలు (17229) సాయంత్రం 04.35 గంటలకు బయలుదేరుతుంది. ఆరో రోజు రాత్రి 12.05 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది. దాంతో ప్యాకేజీ పర్యటన ముగుస్తుంది.

ప్యాకేజీ ధరలు..

కంఫర్ట్‌ క్లాస్‌లో సింగిల్ షేరింగ్‌కు రూ.31,230 చెల్లించాల్సి ఉంటుంది. డబుల్ షేరింగ్‌కు రూ. 16,690గా ధర నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్‌కు రూ.13,080గా నిర్ణయించారు. స్టాండర్డ్ క్లాస్‌లో సింగిల్ షేరింగ్‌కు రూ.29,890 చెల్లించాల్సి ఉంటుంది. డబుల్ షేరింగ్‌కు రూ.15,350గా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్‌కు రూ.11,740 చెల్లించాల్సి ఉంటుంది. పిల్లల‌కు ప్యాకేజీలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులు తీసుకోవాల్సిందే. కంఫర్ట్‌ క్లాస్‌లో థర్డ్‌ ఏసీలో, స్టాండర్డ్‌ కేటగిరిలో స్లీపర్‌ క్లాస్‌లో ప్రయాణం ఉటుంది. ప్యాకేజీలో రైలు టికెట్లతో పాటు హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ ఖర్చులతో పాటు ఇన్సురెన్స్‌ సైతం కవర్‌ అవుతాయి. వివ‌రాలు తెలుసుకోవాలంటే irctctourism.com వెబ్‌సైట్‌లో సంప్రదించాలని ఐఆర్‌సీటీసీ విజ్ఞప్తి చేసింది.