IRCTC Tourism | కేరళ అందాలను చూసొద్దాం రండి..! తక్కువ ధరకే స్పెషల్‌ ప్యాకేజీని ప్రకటించిన ఐఆర్‌సీటీసీ..!

IRCTC Tourism | పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ మరో సరికొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది. కేరళలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనుకునే వారి కోసం ‘కేరళ హిల్స్‌ అండ్‌ వాటర్‌ పేరు’తో ఈ ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో ఆరు రోజులు, ఐదురాత్రుల పాటు పర్యటన కొనసాగుతున్నది. హైదరాబాద్‌ నుంచి టూర్‌ ప్యాకేజీ ఈ నెల 26న ప్రారంభంకానున్నది. పర్యటలో మున్నార్‌, అలెప్పీతో పాటు పలు ప్రాంతాలను సందర్శించే వీలుంది. పర్యటన ఇలా.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ […]

IRCTC Tourism | కేరళ అందాలను చూసొద్దాం రండి..! తక్కువ ధరకే స్పెషల్‌ ప్యాకేజీని ప్రకటించిన ఐఆర్‌సీటీసీ..!

IRCTC Tourism | పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ మరో సరికొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది. కేరళలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనుకునే వారి కోసం ‘కేరళ హిల్స్‌ అండ్‌ వాటర్‌ పేరు’తో ఈ ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో ఆరు రోజులు, ఐదురాత్రుల పాటు పర్యటన కొనసాగుతున్నది. హైదరాబాద్‌ నుంచి టూర్‌ ప్యాకేజీ ఈ నెల 26న ప్రారంభంకానున్నది. పర్యటలో మున్నార్‌, అలెప్పీతో పాటు పలు ప్రాంతాలను సందర్శించే వీలుంది.

పర్యటన ఇలా..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ నెల 26న మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు. రెండోరోజు మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ఎర్నాకులం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి మున్నార్‌కు వెళ్తారు. హోటల్‌లో చెకిన్‌ అయ్యాక సాయంత్రం మున్నార్‌ సిటీలోనే పర్యటన ఉంటుంది. మూడోరోజు రోజు ఉదయం ఎరవికులం నేషనల్‌ పార్క్‌, టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్‌, ఎకో పాయింట్లను సందర్శిస్తారు. రాత్రి మున్నార్‌లోనే బస ఉంటుంది. నాలుగో రోజు అలెప్పీకి బయలుదేరి వెళ్తారు. అక్కడికి వెళ్లి హోటల్‌లోకి చెకిన్‌ అవుతారు. రెడీ అయ్యాక బ్యాక్‌ వాటర్‌ ప్రాంతానికి తీసుకెళ్తారు. రాత్రి అలెప్పీలోనే బస ఉంటుంది. ఐదో రోజు హోటల్‌ నుంచి చెకిన్‌ అయ్యాక ఎర్నాకులం చేరుకుంటారు. ఉదయం 11.20 గంటలకు తిరుగు ప్రయాణం ఉంటుంది. ఆరో రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ ధర ఇలా..

కేరళ టూర్‌ ప్యాకేజీ కోసం వేర్వే ధరలను నిర్ణయించింది. స్టాండర్డ్‌, కంఫర్ట్‌ కేటగిరి ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్‌ కేటగిరిలో స్లీపర్‌క్లాస్‌లో ప్రయాణం ఉంటుంది. కంఫర్ట్‌ కేటగిరిలో థర్డ్‌ ఏసీలో ప్రయాణం ఉంటుంది. కంఫర్ట్‌ కేటగిరిలో సింగిల్‌ షేరింగ్‌కు ర.33,480, ట్విన్‌ షేరింగ్‌కు రూ.19370, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.15,580గా ధర నిర్ణయించారు. స్టాండర్డ్‌ కేటగిరిలో సింగిల్‌ షేరింగ్‌కు రూ.30,770, ట్విన్‌ షేరింగ్‌కు రూ.16,660, ట్రిపుల్‌ షేరింగ్‌కు రూ.12,880 నిర్ణయించారు. అలాగే ఐదేళ్ల నుంచి 11 సంవత్సరాల మధ్య చిన్నారులకు సైతం వేర్వేరు ధరలను నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం irctctourism.com వెబ్‌సైట్‌లో సంప్రదించాలని ఐఆర్‌సీటీసీ కోరింది.