దేశంలో ముదనష్టపు బీజేపీ ప్రభుత్వం ఉంది: సీఎం కేసీఆర్
విధాత, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ బీజేపీ తీరును ఎండగట్టాడు. మన దేశంలో ఒక ముదనష్టపు బీజేపీ ప్రభుత్వం ఉందన్నారు. ఇంతటి దుర్మార్గపు ప్రభుత్వం గతంలో ఎన్నడు లేదన్నారు. మా తెలంగాణ నిధులు, విద్యుత్‌తో పాటు ఉద్యోగ నియామకాలను ఖచ్చితంగా సాధించి తీరుతామని సీఎం కేసీఆర్ శపథం చేశారు. సోమవారం అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం చేసిన సీఎం కేసీఆర్ బీజేపీ తీరుపై మండిపడ్డారు. మోడీ కారణంగా శ్రీలంకలోను ఆందోళనలు జరుగుతున్నాయని, ప్రధాన మంత్రికి వ్యతిరేఖంగా శ్రీలంకలో […]

విధాత, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ బీజేపీ తీరును ఎండగట్టాడు. మన దేశంలో ఒక ముదనష్టపు బీజేపీ ప్రభుత్వం ఉందన్నారు. ఇంతటి దుర్మార్గపు ప్రభుత్వం గతంలో ఎన్నడు లేదన్నారు. మా తెలంగాణ నిధులు, విద్యుత్‌తో పాటు ఉద్యోగ నియామకాలను ఖచ్చితంగా సాధించి తీరుతామని సీఎం కేసీఆర్ శపథం చేశారు.
సోమవారం అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం చేసిన సీఎం కేసీఆర్ బీజేపీ తీరుపై మండిపడ్డారు. మోడీ కారణంగా శ్రీలంకలోను ఆందోళనలు జరుగుతున్నాయని, ప్రధాన మంత్రికి వ్యతిరేఖంగా శ్రీలంకలో ఫ్లకార్డులతో అక్కడి ప్రజలు నిరసన చేస్తున్నారన్నారు.
విధ్యుత్ సంస్కరణల ముసుగులో జారీ చేసిన జీవోలను కేంద్ర ప్రభుత్వం వెనక్కీ తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం శాశ్వతం కాదన్నారు. మరో 14 నెలల్లో బీజేపీ కథ ముగుస్తుందన్నారు. భారత రైతాంగానికి తెలంగాణలో లెక్కనే ఉచిత విధ్యుత్ అందిస్తామన్నారు.
ఈ దేశంలో 15వేల కోట్ల రైతు కుటుంబాలున్నాయన్నారు. బీజేపీ దుర్మార్గపు ప్రభుత్వంను భూ స్థాపితం చేస్తామన్నారు. మాయ మాటలకు, బెదిరింపులకు మేము భయపడమన్నారు. మహారాష్ట్రాలోని సుమారు 15 గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపమని తీర్మాణాలు చేసి పంపుతున్నారని సీఎం గుర్తు చేశారు.
ఇక ముందు బీజేపీ ఆటలు సాగవని, కేవలం మనో 14 నెలలు మాత్రమే బీజేపీ ఉంటుందని, ఆ తరువాత కేంద్రంలో బీజేపీ యేతర ప్రభుత్వం రాబోతుందన్నారు. బీజేపీ ప్రభుత్వానికి కోట్ల ఆదాయం ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం తప్పా కొత్తగా ఓ ప్రాజెక్టు నిర్మించడం తెలియనే తెలియదన్నారు.
కేంద్రంలో ఉన్న విద్యత్ శాఖ మంత్రి మెడకు పెడితే కాలుకు, కాలుకు పెడితే మెడకు పెడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, అయినా మా రాష్ర్ట రైతులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఉచిత విధ్యుత్‌ను అందించేందుకు పోరాడుతామన్నారు.