ఆ ప్రచారంపై ఔననలేను, కాదనలేను: జగ్గారెడ్డి
విధాత: వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదంటూ జరిగిన ప్రచారాన్ని రికార్డెడ్‌గా ప్రస్తుతం ధ్రువీకరించలేనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై అవునని కానీ.. కాదని కానీ చెప్పలేనంటూ దాటవేశారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని.. ఎలాంటి నిర్ణయాన్నైనా ప్రకటించే ముందు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో కాంగ్రెస్ కార్యకర్త పోటీచేస్తారని తాను ప్రకటించినట్లుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో జగ్గారెడ్డి స్పందించారు. నేను ఈ […]

విధాత: వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదంటూ జరిగిన ప్రచారాన్ని రికార్డెడ్‌గా ప్రస్తుతం ధ్రువీకరించలేనని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై అవునని కానీ.. కాదని కానీ చెప్పలేనంటూ దాటవేశారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని.. ఎలాంటి నిర్ణయాన్నైనా ప్రకటించే ముందు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో కాంగ్రెస్ కార్యకర్త పోటీచేస్తారని తాను ప్రకటించినట్లుగా ప్రచారం జరిగిన నేపథ్యంలో జగ్గారెడ్డి స్పందించారు. నేను ఈ మధ్య రాజకీయాల గురించి మాట్లాడటం లేదు. నా పేరు మీద ఎందుకు వచ్చిందో తెలియదు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని, ఎవరైనా కార్యకర్త పోటీ చేస్తే వారికి అవకాశం ఇస్తానని, ఎవరైనా కార్యకర్త, నాయకుడు ముందుకు రాకపోతే నా భార్యనే పోటీలో నిలబెడుతానని కొన్ని చానళ్లలో బ్రేకింగ్ న్యూస్‌లు, కథనాలు వచ్చాయి.
అది నిజమా? అబద్ధమా అనేది నేను ఇప్పుడు చెప్పలేను! ఎందుకంటే నేను ఒక నిర్ణయాన్ని ప్రకటించేముందు పీసీసీ దృష్టికి తీసుకెళ్లాలి, అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలి. ఇంకా పదహారు నెలల సమయం ఉన్నది కాబట్టి ఎలాంటి విషయాలు రికార్డు పరంగా నేనెక్కడా మాట్లాడలేదు. అయితే ఈ వార్తలు వచ్చనవి నిజమా ? అబద్ధమా అని నన్ను ప్రశ్నిస్తే నేను కాదనలేను అన్నారు.