భద్రక్‌-విజయనగరం రైల్వే లైన్ లేనట్లే

విధాత,న్యూఢిల్లీ: భద్రక్‌-విజయనగరం మధ్య 2015-16 రైల్వే బడ్జెట్‌లో ప్రతిపాదించిన మూడో రైల్‌ లైన్‌ నిర్మాణానికి ఇంకా ఆమోదం పొందలేదని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ రాజ్యసభకు తెలిపారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా జవాబిస్తూ ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి రూపొందించిన డీపీఆర్‌ ప్రకారం 385 కిలోమీటర్ల దూరం నిర్మించే ఈ రైలు మార్గం నిర్మాణానికి 3823 కోట్ల రూపాయలు ఖర్చు కాగలదని అంచనా వేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ ఇంకా ఆమోదానికి నోచుకోనందున […]

భద్రక్‌-విజయనగరం రైల్వే లైన్ లేనట్లే

విధాత,న్యూఢిల్లీ: భద్రక్‌-విజయనగరం మధ్య 2015-16 రైల్వే బడ్జెట్‌లో ప్రతిపాదించిన మూడో రైల్‌ లైన్‌ నిర్మాణానికి ఇంకా ఆమోదం పొందలేదని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ రాజ్యసభకు తెలిపారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా జవాబిస్తూ ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి రూపొందించిన డీపీఆర్‌ ప్రకారం 385 కిలోమీటర్ల దూరం నిర్మించే ఈ రైలు మార్గం నిర్మాణానికి 3823 కోట్ల రూపాయలు ఖర్చు కాగలదని అంచనా వేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ ఇంకా ఆమోదానికి నోచుకోనందున కాలయాపన వలన ప్రాజెక్ట్‌ వ్యయం పెరిగే అవకాశమే లేదని చెప్పారు.