Corona: 36 వేల కొత్త కేసులు.. 39 వేల రికవరీలు

మళ్లీ పెరిగిన మృతుల సంఖ్యవిధాత,దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. మరోసారి కొత్త కేసులు, మరణాలు పెరిగినట్లు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాలను వెల్లడిస్తున్నాయి. తాజాగా 18,73,757 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా..36,401 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ముందురోజుతో పోల్చితే కేసుల్లో 3.4 శాతం పెరుగుదల కనిపించింది. అలాగే 24 గంటల వ్యవధిలో 530 మంది వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 3.23 కోట్లకు చేరగా.. 4,33,039 మంది […]

Corona: 36 వేల కొత్త కేసులు.. 39 వేల రికవరీలు

మళ్లీ పెరిగిన మృతుల సంఖ్య
విధాత,దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. మరోసారి కొత్త కేసులు, మరణాలు పెరిగినట్లు గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాలను వెల్లడిస్తున్నాయి. తాజాగా 18,73,757 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా..36,401 మందికి వైరస్ సోకినట్లు తేలింది.

ముందురోజుతో పోల్చితే కేసుల్లో 3.4 శాతం పెరుగుదల కనిపించింది. అలాగే 24 గంటల వ్యవధిలో 530 మంది వైరస్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 3.23 కోట్లకు చేరగా.. 4,33,039 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.

నిన్న 39 వేల మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.15 కోట్ల(97.53 శాతం) మార్కును దాటాయి. క్రియాశీల కేసులు 3.6లక్షలకు తగ్గగా.. ఆ రేటు 1.13 శాతంగా ఉంది. మరోపక్క నిన్న 56,36,336 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు 56.64 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి.