Corona: 40వేలపైనే కొత్త కేసులు.. ఒక్క కేరళలోనే 70శాతం
విధాత,దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా కొత్త కేసులు 40వేల పైనే ఉంటున్నాయి. దీంతో క్రియాశీల కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 42,909 కొత్త కేసులు బయటపడ్డాయి. కాగా.. ఇందులో దాదాపు 70శాతం కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదవడం గమనార్హం. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 14,19,990 మందికి పరీక్షలు నిర్వహించగా.. 42,909 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. క్రితం […]

విధాత,దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా కొత్త కేసులు 40వేల పైనే ఉంటున్నాయి. దీంతో క్రియాశీల కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 42,909 కొత్త కేసులు బయటపడ్డాయి. కాగా.. ఇందులో దాదాపు 70శాతం కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదవడం గమనార్హం.
- గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 14,19,990 మందికి పరీక్షలు నిర్వహించగా.. 42,909 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. క్రితం రోజు కేసుల(45,083)తో పోలిస్తే నేడు కేసులు కాస్త తగ్గినప్పటికీ 40వేల పైనే ఉండటం కలవరపెడుతోంది. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.27 కోట్లకు చేరింది.
- దక్షిణాది రాష్ట్రం కేరళలో కరోనా విజృంభణ ఆందోళనకరంగానే ఉంది. నిన్న అక్కడ 29,836 కొత్త కేసులు వెలుగుచూశాయి. దేశంలో నమోదైన మొత్తం కొత్త కేసుల్లో 69.5శాతం ఒక్క ఈ రాష్ట్రంలోనే బయటపడ్డాయి.