ఒలింపిక్స్ కు అర్హత సాధించిన మొదటి భారతీయ మహిళ స్విమ్మర్
విధాత:మానా పటేల్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన 21 సంవత్సరాల ఈ స్విమ్మర్ మన దేశం తరపున ఒలింపిక్స్ కు క్వాలిఫై అయిన మొదటి మహిళా స్విమ్మర్. కామర్స్ లో పట్టభద్రురాలు అయిన ఈ అథ్లెట్ ఈ దఫా టోక్యో ఒలింపిక్స్ లో యూనివరసాలిటీ ( మామూలు పద్ధతి లో మరేయితర వారు ఎన్నికకాని పక్షం లో ప్రత్యేక పద్ధతి లో ఎన్నిక చేయబడే) విధానం లో ఎన్నికైన మన భారత స్విమ్మర్. 2019 లో మోకాలి గాయంతో […]

విధాత:మానా పటేల్ గుజరాత్ రాష్ట్రానికి చెందిన 21 సంవత్సరాల ఈ స్విమ్మర్ మన దేశం తరపున ఒలింపిక్స్ కు క్వాలిఫై అయిన మొదటి మహిళా స్విమ్మర్. కామర్స్ లో పట్టభద్రురాలు అయిన ఈ అథ్లెట్ ఈ దఫా టోక్యో ఒలింపిక్స్ లో యూనివరసాలిటీ ( మామూలు పద్ధతి లో మరేయితర వారు ఎన్నికకాని పక్షం లో ప్రత్యేక పద్ధతి లో ఎన్నిక చేయబడే) విధానం లో ఎన్నికైన మన భారత స్విమ్మర్. 2019 లో మోకాలి గాయంతో తో ఈతకు దూరమైనా అనేక ఒడిధుకుల మధ్య ముఖ్యంగా పాండమిక్ వల్ల స్విమ్మింగ్ పూల్స్ అన్ని మూసివేయబడినా తన ప్రత్యేక బ్యాక్ స్ట్రోక్ లో యుజ్బెకిస్తాన్ లో ఏప్రిల్ లో తన పునరాగమనాని గోల్డ్ మెడల్ తో ఘనంగా మొదలుపెట్టింది. 2015 నుండి అనేక అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టిన మానా పటేల్ ఇప్పటివరకు సుమారు 20 అంతర్జాతీయ 70 జాతీయ స్థాయి మెడల్స్ సాధించడం విశేషం.