ప్లాష్ ప్లాష్.. చెన్నై మరియు నెల్లూరుకు రెడ్ అలర్ట్

విధాత : చెన్నై మరియు నెల్లూరులకు వాతావరణ శాఖహెవీ రైన్ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో రానున్న 48 గంటల్లో అతి భారీ వర్షాలు పడుతాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇదిలా ఉండగా భారీవర్షాలతో చెన్నై నీట మునిగింది. రైల్వే శాఖ ఎలక్ట్రిసిటీ లోకల్ ట్రైన్స్ రద్దు చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం స్టాలిన్ పర్యటించారు. అదేవిధంగా తిరుమల, తిరుపతిలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో తిరుపతి నగర వీధులన్నీ […]

ప్లాష్ ప్లాష్.. చెన్నై మరియు నెల్లూరుకు రెడ్ అలర్ట్

విధాత : చెన్నై మరియు నెల్లూరులకు వాతావరణ శాఖ
హెవీ రైన్ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో రానున్న 48 గంటల్లో అతి భారీ వర్షాలు పడుతాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఇదిలా ఉండగా భారీవర్షాలతో చెన్నై నీట మునిగింది. రైల్వే శాఖ ఎలక్ట్రిసిటీ లోకల్ ట్రైన్స్ రద్దు చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం స్టాలిన్ పర్యటించారు.

అదేవిధంగా తిరుమల, తిరుపతిలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో తిరుపతి నగర వీధులన్నీ జలమయమయ్యాయి. తిరుమలలో వర్షం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి.