రాబోయే ఐదు రోజుల్లో ఈ రాష్ట్రాల‌లో భారీ వ‌ర్షాలు

విధాత,న్యూఢిల్లీ:ఢిల్లీ-ఎన్సీఆర్‌తో పాటు హిమాచల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో రాబోయే నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. అలాగే పంజాబ్, హరియాణాలలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, మధ్య మహారాష్ట్ర, గోవాలలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. కాగా భారీ వర్షాలతో ఢిల్లీ నగరం తడిసిముద్దవుతోంది. రికార్డు స్థాయిలో 107.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. తెలుగు రాష్ట్రాల‌లో కూడా వ‌ర్షాలు కురుస్తున్నాయి. ప‌లు ప్రాజెక్టుల‌కు […]

రాబోయే ఐదు రోజుల్లో ఈ రాష్ట్రాల‌లో భారీ వ‌ర్షాలు

విధాత,న్యూఢిల్లీ:ఢిల్లీ-ఎన్సీఆర్‌తో పాటు హిమాచల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో రాబోయే నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. అలాగే పంజాబ్, హరియాణాలలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, మధ్య మహారాష్ట్ర, గోవాలలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. కాగా భారీ వర్షాలతో ఢిల్లీ నగరం తడిసిముద్దవుతోంది. రికార్డు స్థాయిలో 107.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. తెలుగు రాష్ట్రాల‌లో కూడా వ‌ర్షాలు కురుస్తున్నాయి. ప‌లు ప్రాజెక్టుల‌కు వ‌ర‌ద ప్ర‌వాహం కొన‌సాగుతోంది.