వరదలలో చిక్కుకున్న మంత్రి.. పాపం అంటున్నా నెటిజన్లు

విధాత:గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మధ్యప్రదేశ్ లోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆయా ప్రాంతాల్లోని బాధితులకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. వరద బాధితులను కాపాడేందుకు వెళ్లిన మంత్రి అక్కడ బుక్ అయ్యారు. ఆయనను రక్షించడానికి వైమానిక దళం రావాల్సి వచ్చింది. దరియా జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు హోంశాఖ మంత్రి సరోత్తమ్ మిశ్రా వెళ్లారు. అయితే మంత్రి బృందం వెళ్లిన పడవపై చెట్టు పడిపోవడంతో ఇంజన్ సాంకేతిక లోపం తలెత్తి నిలిచిపోయింది. […]

వరదలలో చిక్కుకున్న మంత్రి.. పాపం అంటున్నా నెటిజన్లు

విధాత:గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మధ్యప్రదేశ్ లోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆయా ప్రాంతాల్లోని బాధితులకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. వరద బాధితులను కాపాడేందుకు వెళ్లిన మంత్రి అక్కడ బుక్ అయ్యారు. ఆయనను రక్షించడానికి వైమానిక దళం రావాల్సి వచ్చింది. దరియా జిల్లాలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు హోంశాఖ మంత్రి సరోత్తమ్ మిశ్రా వెళ్లారు. అయితే మంత్రి బృందం వెళ్లిన పడవపై చెట్టు పడిపోవడంతో ఇంజన్ సాంకేతిక లోపం తలెత్తి నిలిచిపోయింది. దీంతో వీరు వరద లో చిక్కుకున్నారు.

వరదలో చిక్కుకున్న విషయాన్ని మంత్రి అధికార యంత్రాంగానికి తెలియజేయగా అప్రమత్తం అయ్యారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాఫ్టర్ ను ఘటనా స్థలానికి పంపించి మంత్రి మిశ్రాను రక్షించారు. వైమానిక దళానికి చెందిన సహాయ సిబ్బంది హోంమంత్రితో పాటు మరో ఏడుగురు గ్రామస్తులను కాపాడారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత భూపేంద్ర గుప్తా పబ్లిసిటీ స్టంట్ గా అభివర్ణించారు.