జాతీయ జెండా నియమాలు…

విధాత‌: రేపు స్వాతంత్ర‌దినోత్స‌వం సందర్భంగా మ‌న జాతీయ జెండా నియ‌మాల‌ను తెలుసుకుందాం.జెండా ఎగురవేయడంలో నియమాలు తెలిసో తెలియకో కొన్ని లోటుపాట్లు జరుగుతున్నవి.కాగా రాజ్యాంగా స్పూర్తికి విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేయటం కూడా జరుగుతుండ‌గా 2002 లో కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన విషయాలు గెజిట్ లో ఈ విదంగా ప్రకటించింది. అవి ఏంటంటే Flag code of India సెక్షన్ V రూల్ ప్రకారం రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే సంధర్భంగా జెండాలో పూలుపెట్టి ఎగుర వేయవచ్చు. జెండా […]

జాతీయ జెండా నియమాలు…

విధాత‌: రేపు స్వాతంత్ర‌దినోత్స‌వం సందర్భంగా మ‌న జాతీయ జెండా నియ‌మాల‌ను తెలుసుకుందాం.జెండా ఎగురవేయడంలో నియమాలు తెలిసో తెలియకో కొన్ని లోటుపాట్లు జరుగుతున్నవి.కాగా రాజ్యాంగా స్పూర్తికి విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేయటం కూడా జరుగుతుండ‌గా 2002 లో కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన విషయాలు గెజిట్ లో ఈ విదంగా ప్రకటించింది.

అవి ఏంటంటే Flag code of India సెక్షన్ V రూల్ ప్రకారం రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే సంధర్భంగా జెండాలో పూలుపెట్టి ఎగుర వేయవచ్చు.

జెండా ఎవరు ఎగుర వేయాలనేది ఒక సమస్య..
విధాన నిర్ణాయక సంస్థలు,బాధ్యులు ప్రధాని,ముఖ్యమంత్రి, ZP చైర్మెన్,గ్రామ సర్పంచ్ మొదలగు వారు.
కార్యనినిర్వహణ సంస్థలు రాష్ట్రపతి, గవర్నర్ కలెక్టర్ MDO, MEO.MRO హెడ్ మాష్టర్ ప్రిన్సిపాల్ ఈ విధంగా రెండు రకాల వారు ఎగుర వేయ‌వ‌చ్చు.

సాధారణ నియమాలు…

జాతీయ జెండా చేనేత ఖాది,కాటన్ గుడ్డతో తయారైనది ఉండాలి.జెండా పొడవు 3:2 నిష్పత్తిలో ఉండాలి. 6300×4200 మి.మీ. నుండి 150×100 మి.మీ.వరకు మొత్తం 9 రకాలుగా పేర్కోనడం జరిగింది.ప్లాస్టిక్ జెండాలు అసలే వాడరాదు.పై నుండి క్రిందకు 3 రంగులు సమానంగా ఉండాలి.జెండాను నేలమీదగాని, నీటి మీద పడనీయరాదు అలాగే జెండాపై ఎలాంటి రాతలు,సంతకాలు, ప్రింటింగులు ఉండరాదు.

జెండా ఎప్పుడూ నిటారుగా ఉండాలి.కిందికి వంచకూడదు.జెండాను వడిగా,(వేగంగా) ఎగురవేయాలి.జెండాను ఎగురవేయడం ,మరియు దించడం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపున చేయాలి.జెండా మధ్యలోని ధర్మచక్రంలో 24 ఆకులుండాలి.జెండా పాతబడితే తుడుపు గుడ్డగా మాత్రం ఎట్టి పరిస్థితులలో ఉపయోగించరాదు అది నేరం..దానిని కాల్చివేయాలి.ఎక్కడంటే అక్కడ పడ వేయరాదు.ఒకవేల వివిధ రకాల జెండాల పక్కన ఎగుర వేయవలసి వ‌స్తే జాతీయ జెండా మిగతా వాటికంటే ఎత్తుగా ఉండాలి..జెండాను ఎగుర వేస్తున్న‌పుడు జాతీయనాయకుల ఫోటోలు ఉంచాలి.

జెండాను ముందుగా 1,2 సార్లు పరిశీలించుకోవాలి. ఎక్కించి దించడం, మరల ఎక్కించడం చేయరాదు.జెండా పోల్ నిటారుగా ఉండాలి.వంకరగా ఉండరాదు.జేబులకు ఉంచే చిన్న జెండాలు కింద ఎక్కడంటే అక్కడ పడ వేయరాదు. వాటిని తొక్కనీయరాదు,వాటిని వీలయితే అన్ని ఏరి కాల్చి వేయాలి.వీలైనంత వరకు పురికోసలకు కట్టే పరారలకు త్రివర్ణ పతాకాలను (చిన్నవి) అతికించరాదు.రంగు రంగుల కాగితాలు మాత్రమే అతికించాలి.రెడీమేడ్ ప్లాస్టిక్ త్రివర్ణ పతాకాలు కడుతున్నాం వాటిని కూడా వాడరాదు.