నేడు జాతీయ చేనేత దినోత్సవం

విధాత‌:జాతీయ చేనేత దినోత్సవం ఆగష్టు 7న దేశవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. భారత స్వాతంత్ర్యోద్యమములో ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్య్ర సమపార్జనకు ఒక సాధనంగా నిలిచింది చేనేత. గాంధీజీ కూడా రాట్నంపై నూలు వడకడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేతరంగానికి ఒకరోజు ఉండాలన్న ఉద్దేశ్యంతో జాతీయ చేనేత దినోత్సవంను ఏర్పాటుచేయడం జరిగింది. మనం కట్టుకుని మురిసిపోయే వస్త్రాలు.. ఎంతో మంది పడుగుపేకల జీవితానికో అద్దం పడతాయి. మన దేశ సంస్కృతి సంప్రదాయాలను చాటిచెపుదాం.

నేడు జాతీయ చేనేత దినోత్సవం

విధాత‌:జాతీయ చేనేత దినోత్సవం ఆగష్టు 7న దేశవ్యాప్తంగా ప్రతి ఏట నిర్వహిస్తారు. భారత స్వాతంత్ర్యోద్యమములో ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్య్ర సమపార్జనకు ఒక సాధనంగా నిలిచింది చేనేత. గాంధీజీ కూడా రాట్నంపై నూలు వడకడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేతరంగానికి ఒకరోజు ఉండాలన్న ఉద్దేశ్యంతో జాతీయ చేనేత దినోత్సవంను ఏర్పాటుచేయడం జరిగింది.

 స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా మన జాతిపిత చేనేతకి ఉన్న ప్రాముఖ్యత ని తెలియచేస్తూ.. ఎవరికి వారు రాట్నం పై నూలు వడకాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఖద్థరు వస్త్రాలు ధరించాలనీ పిలుపు ఇచ్చారు. ఆ మహాత్ముని ఆదేశం మేర ఆనాటి స్వాతంత్య్ర సమరయేధులే కాక ప్రతి ఇంటిలోనూ స్ర్తీ లు, పురుషులు, పిల్లలు కూడా స్వయంగా నూలు వడికి, ఖద్దరు బట్టలనే ఎక్కువగా వాడేవారు. 

మన దేశ సంస్కృతి సాంప్రదాయాలలో ఈ చేనేతకి గొప్ప పేరుంది. దేశం నలుచెరగులలోనూ, కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకూ బెంగాల్ నుంచి అస్సాం వరకూ.. ఏ ప్రాంతానికి తగినట్టుగా ఆయా పేర్లతో చేనేత వస్త్రాలు ప్రసిద్ధి పొందాయి. 

  అగ్గిపెట్టెలో పట్టేంత చీరని నేసిన చేనేత కళాకారులు మన దేశంలో వున్నారని చెప్పుకోవడం మనకెంతో గర్వ కారణం. పడుగు పేక దారాల కలనేత, ఆ కార్మికుల  కళల కలబోత.. 

 మన దేశంలో తయారయిన చేనేత చీరలకి విదేశాలలో కూడా ఎంతో గొప్ప పేరుంది. విదేశీ ప్రముఖులు మన దేశ పర్యటన కి వచ్చినపుడు వారికి మనవారు ఇచ్చే బహుమతులలో ఈ చేనేత చీరలు తప్పకుండా ఉంటూంటాయి. 

    విడిగా దుకాణాల లో కన్నా కూడా నేరుగా ఆ మగ్గాలు ఉండే చోటకి వెళ్ళడం.. ఆయా పేరు పొందిన ఊళ్ళకి వెళ్ళడం.. ఉదాహరణకు.. ఉప్పాడ, వెంకటగిరి, నారాయణపేట, ఇంకా పెళ్ళిళ్ళు వంటి వాటికి నేరుగా కంచి, ధర్మవరం వంటి ఊళ్ళకి వెళ్లి పట్టుచీరలు కొనడం మనలో చాలా మందికి అలవాటే. 

 ఒక చీర ఎంతో బావుందని మనమెంతో మెచ్చుకుంటాము. కానీ దాని వెనక ఎంతమంది కార్మికుల  శ్రమ దాగుందో మనం గుర్తించడం లేదు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం వారి చేతికి రానేరాదు. పెట్టుబడి పెట్టలేక, పెట్టిన పెట్టుబడికి సరైన  లాభాలు రాక, అప్పుల పాలయిన ఎందరో చేనేత కార్మికుల జీవితాలు ఆ మగ్గాల మధ్య ఆగిపోతున్నాయి. రాలిపోతున్నాయి. 

మనం కట్టుకుని మురిసిపోయే వస్త్రాలు.. ఎంతో మంది పడుగుపేకల జీవితానికో అద్దం పడతాయి.

తమిళనాడు  ప్రభుత్వం చేనేతని ప్రోత్సహించే భాగంలో.. కాలేజీ అమ్మాయిలు వారంలో ఒకరోజు తప్పనిసరిగా చేనేత దుస్తులనే ధరించాలని నిబంధన పెట్టింది. 
   చేనేత కార్మికులకి మనవంతు చేయూతని ఇద్దాం. మన వంతు సహాయ సహకారాలు అందిద్దాము.  మన ఇంట్లో శుభకార్యాలలో పెట్టుబడి చీరలకి ఇలాగే చేనేత చీరలు, పంచెలు తీసుకుందాం. మనం కుడా ఎక్కువగా చేనేత దుస్తులు ధరిద్దాము. నిజానికి ఈ చేనేత చీరలు చూడడానికి చాలా హుందాగా ఉంటాయి. పైగా శరీరానికి కూడా చాలా అనువుగా ఉంటాయి. ఈ వస్త్రధారణ ద్వారా 

మన దేశ సంస్కృతి సంప్రదాయాలను చాటిచెపుదాం.

 ఈ చేనేత వస్త్రాలపై మీమీ అభిరుచి, అభిప్రాయాలు చెప్పగలరు. ఇంకామీకు తెలిసిన చేనేతలకి ప్రాచుర్యం ఉన్న ఊర్లని, ఆ వస్త్రాలు పరిచయం చేయండి.