19 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
విధాత:పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 19 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. సభలు సుమారు 20 రోజుల పాటు కొలువుదీరనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు తేదీలు సిఫార్సు చేసినట్లు సమాచారం. పార్లమెంటు ప్రాంగణంలో కొవిడ్ నిబంధనలు పక్కాగా పాటిస్తూ సమావేశాలను నిర్వహించనున్నారు. ఆ సమయానికల్లా పార్లమెంటుకు వచ్చేవారంతా కనీసం ఒక్క డోసైనా కరోనా వ్యాక్సిన్ తీసుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు.