లక్షద్వీప్ ప్రజలారా… మీకు నేనున్నా..రాహుల్‌గాంధీ.
విధాత:కేంద్రపాలిత లక్షదీప్‌కు కొత్తరూపం పేరుతో అక్కడి అడ్మినిస్ట్రేటర్ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు అగ్గి రాజేశాయి. ఆ నిర్ణయాలతో అక్కడ ఉద్యమమే సాగుతోంది. ఈ విషయంపై రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అడ్మినిస్ట్రేటర్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్న ప్రజలకు రాహుల్ తన సంఘీభావాన్ని ప్రకటించారు. ‘‘భారత్‌కు లక్షద్వీప్ ఓ ఆభరణం. అధికారంలో ఉన్న అజ్ఞానపు పెద్దలు దానిని ధ్వంసం చేస్తున్నారు. లక్షద్వీప్ ప్రజలతోనే మేమున్నాం.’’ అని రాహుల్ ట్విట్టర్ వేదికగా భరోసా కల్పించారు. విద్య, ఆరోగ్యం, […]

విధాత:కేంద్రపాలిత లక్షదీప్‌కు కొత్తరూపం పేరుతో అక్కడి అడ్మినిస్ట్రేటర్ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు అగ్గి రాజేశాయి. ఆ నిర్ణయాలతో అక్కడ ఉద్యమమే సాగుతోంది. ఈ విషయంపై రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అడ్మినిస్ట్రేటర్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్న ప్రజలకు రాహుల్ తన సంఘీభావాన్ని ప్రకటించారు. ‘‘భారత్‌కు లక్షద్వీప్ ఓ ఆభరణం. అధికారంలో ఉన్న అజ్ఞానపు పెద్దలు దానిని ధ్వంసం చేస్తున్నారు. లక్షద్వీప్ ప్రజలతోనే మేమున్నాం.’’ అని రాహుల్ ట్విట్టర్ వేదికగా భరోసా కల్పించారు.
విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మత్స్య, పశుపోషణ శాఖలు జిల్లా పంచాయతీ పరిధిలోనే ఉండేవి. వాటిని అడ్మినిస్ట్రేటర్ కిందికి తీసుకొచ్చారు. ఈ దీవుల్లో ఎక్కువగా మాంసాహారాన్ని భుజిస్తారు. అయినప్పటికీ జంతు వధను, బీఫ్‌ను నిషేధించారు. వీటితో పాటు తగిన పత్రాలు ఉన్నప్పటికీ అక్రమ కట్టడాల పేరుతో నిబంధనలు పాటించకుండా ఇళ్లను కూలగొట్టడం, 2019 లో కేంద్రానికి వ్యతిరేకంగా వాల్‌పోస్టర్లు అతికించారన్న నెపంతో కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం మద్య నిషేధం అమలులో ఉంది. అయితే పర్యాటకులను అడ్డం పెట్టుకొని, మద్యం అమ్మకాలకు అనుమతులివ్వడం లాంటి నిర్ణయాలను అడ్మినిస్ట్రేటర్ తీసుకున్నారు. వీటిని వ్యతిరేకిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు.