అయోధ్య అభివృద్ధిపై ప్రధాని మోదీ సమీక్ష
రెండోసారి వర్చువల్‌గా మాట్లాడుకున్న యోగి, మోదీ విధాత,న్యూఢిల్లీ: ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారని వార్తలొస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌దాస్‌లు రెండోసారి అయోధ్య అభివృద్ధిపై వర్చువల్ సమావేశంలో మాట్లాడుకున్నారు. అయోధ్యలో చేపడుతున్న రామాలయ అభివృద్ధి పనులను ప్రధాని మోదీ సమీక్షించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో మోదీ వర్చువల్ వీడియో సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఇద్దరూ ఇటీవల భేటీలో పాల్గొనడం ఈనెలలో రెండవసారి. అయోధ్య అభివృద్ధి కోసం చేపడుతున్న అభివృద్ధి పనుల ప్రణాళికలను యోగి […]

రెండోసారి వర్చువల్‌గా మాట్లాడుకున్న యోగి, మోదీ
విధాత,న్యూఢిల్లీ: ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారని వార్తలొస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌దాస్‌లు రెండోసారి అయోధ్య అభివృద్ధిపై వర్చువల్ సమావేశంలో మాట్లాడుకున్నారు. అయోధ్యలో చేపడుతున్న రామాలయ అభివృద్ధి పనులను ప్రధాని మోదీ సమీక్షించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో మోదీ వర్చువల్ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.
ఈ ఇద్దరూ ఇటీవల భేటీలో పాల్గొనడం ఈనెలలో రెండవసారి. అయోధ్య అభివృద్ధి కోసం చేపడుతున్న అభివృద్ధి పనుల ప్రణాళికలను యోగి వివరించారు. రోడ్ల నిర్మాణం, మౌళిక సదుపాయాలు, రైల్వే స్టేషన్, విమానాశ్రయ నిర్మాణాల కోసం వేసిన ప్రణాళికలను సీఎం యోగి తెలియజెప్పారు. అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలన్న ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు సీఎం యోగి గతంలోనే తెలిపారు. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి .. చర్చిస్తేనే అయోధ్య పనుల్లో పురోగతి ఉంటుందని అయోధ్య ఆలయ పూజారి సత్యేంద్ర దాస్ తెలిపారు.