ముగిసిన రఘురామకృష్ణరాజు వైద్య పరీక్షలు
విధాత,సికింద్రాబాద్: సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ఎంపీ రఘురామకృష్ణరాజు వైద్య పరీక్షలు ముగిశాయి. రఘురామ ల్యాబ్ రిపోర్ట్స్‌ను ఆర్మీ వైద్య బృందం పరిశీలించింది. వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ చేసి సీల్డ్ కవర్లో అధికారులు భద్రపర్చారు. న్యాయాధికారి నాగార్జున నేతృత్వంలో రఘురామకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రఘురామ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆర్మీ వైద్యులు చెబుతున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆర్మీ ఆస్పత్రిలోనే రఘురామకు చికిత్స అందిస్తారు.