శాస్త్రోక్తంగా శ్రీ కోదండరాముడి చక్రస్నానం

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన గురువారం ఉదయం ఆల‌యంలోని రంగ మండ‌పంలో చక్రస్నానం (అవభృథోత్సవం) జరిగింది. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా చక్రస్నానం నిర్వ‌హించారు.

 ఈ సందర్భంగా  ఉదయం 4.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారి మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన నిర్వహించారు. త‌రువాత‌ శ్రీ లక్ష్మణ సమేత సీతారాములవారు, సుదర్శన చక్రత్తాళ్వార్‌ను ఆల‌యంలోని రంగ మండ‌పంలో వేంచేపు చేశారు.

      కంక‌ణ బ‌ట్ట‌ర్‌ శ్రీ రాజేష్ భట్టార్ ఆధ్వర్యంలో ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు పుణ్యాహ‌వ‌చ‌నం, స్వామి, అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌కు న‌వ‌క‌ల‌శ‌ స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో సీతారామ లక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లును పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకించారు. అనంత‌రం అర్చకుల వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా గంగాళంలో చక్రస్నానం నిర్వ‌హించారు. త‌రువాత‌ నివేద‌న‌, మంత్ర‌పుష్పం, మంగ‌ళ హార‌తి సమర్పించారు.  

   కాగా రాత్రి 7.00 గంటలకు ధ్వజావరోహణంతో శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ ముర‌ళీధ‌ర్‌, సూప‌రింటెండెంట్ శ్రీ వెంక‌టేశ‌య్య‌ ఆల‌య అర్చ‌కులు  అధికారులు పాల్గొన్నారు.