గంగానదిలో అస్తికలు క‌లిపేందుకు SPPED POST స‌హ‌కారం!

విధాత:COVID సంక్షోభం నేపథ్యంలో మరణించిన వారి అస్తికలను గంగానదిలో కలిపేందుకు పోస్టల్‌ శాఖ నూతన విధానానికి శ్రీకారం చుడుతూ… స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా.. దేశంలో ఎక్కడి నుంచైనా అస్తికలు పంపితే.. వారణాసి, ప్రయాగ్‌రాజ్‌, హరిద్వార్‌, గయలోని గంగానదిలో కలిపేందుకు ఏర్పాట్లు చేసింది. మృతిచెందిన వారి అస్తికలను గంగానదిలో కలపడాన్ని హిందువులు పవిత్రమైనదిగా భావిస్తుంటారు. కరోనా ఆంక్షలతో అది క్లిష్టంగా మారింది. దీంతో పోస్టల్‌ శాఖ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. Varanasi ఓమ్‌ దివ్య దర్శన్‌ అనే […]

గంగానదిలో అస్తికలు క‌లిపేందుకు SPPED POST స‌హ‌కారం!

విధాత:COVID సంక్షోభం నేపథ్యంలో మరణించిన వారి అస్తికలను గంగానదిలో కలిపేందుకు పోస్టల్‌ శాఖ నూతన విధానానికి శ్రీకారం చుడుతూ… స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా.. దేశంలో ఎక్కడి నుంచైనా అస్తికలు పంపితే.. వారణాసి, ప్రయాగ్‌రాజ్‌, హరిద్వార్‌, గయలోని గంగానదిలో కలిపేందుకు ఏర్పాట్లు చేసింది. మృతిచెందిన వారి అస్తికలను గంగానదిలో కలపడాన్ని హిందువులు పవిత్రమైనదిగా భావిస్తుంటారు. కరోనా ఆంక్షలతో అది క్లిష్టంగా మారింది. దీంతో పోస్టల్‌ శాఖ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.

Varanasi ఓమ్‌ దివ్య దర్శన్‌ అనే సామాజిక సేవా సంస్థ సంయుక్తంగా speed post విధానాన్ని ప్రారంభించింది. దేశంలో ఎక్కడి నుంచైనా అస్తికలను స్పీడ్‌ పోస్ట్‌ ద్వారా ఓమ్‌ దివ్య దర్శన్‌ కార్యాలయానికి పంపించవచ్చు. వీటిని సామాజిక సేవా సంస్థ సిబ్బంది.. వారణాసి, ప్రయాగ్‌రాజ్‌, హరిద్వార్‌, గయలో నిమజ్జనం చేస్తారు. అయితే స్పీడ్‌ పోస్ట్‌ చేసేవారు ముందుగా ఓమ్‌ దివ్య దర్శన్‌ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకోవాలని వారణాసి పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ కృష్ణ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. ఓమ్‌ దివ్య దర్శన్‌ సేవాసంస్థ సభ్యులు.. శాస్తోక్త్రంగా అస్థికలను నిమజ్జనం చేస్తారని, అనంతరం ఓ సీసాలో గంగానది నీటిని కుటుంబ సభ్యులకు పోస్ట్‌ ద్వారా పంపిస్తారని వెల్లడించారు.