క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న తెలుగు ప్రజాప్రతినిధులు
విధాత: క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల్లో కోర్టుల్లో అభియోగాలు దాఖలైన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్‌లో 24 మంది ఉన్నారు. 2019 నుంచి 2021 వరకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన 2,495 మంది ప్రజాప్రతినిధుల అఫిడవిట్లను ప్రజాస్వామిక సంస్కరణల సంఘం (ఏడీఆర్) అధ్యయనం చేసి.. సోమవారం నివేదిక విడుదల చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(1),(2),(3)లో పేర్కొన్న నేరాల కిందకు వచ్చే కేసుల్లో కోర్టులు అభియోగాలు నమోదు చేసిన వారి వివరాలను అందులో వెల్లడించింది. ఈ సెక్షన్ల ప్రకారం […]

విధాత: క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల్లో కోర్టుల్లో అభియోగాలు దాఖలైన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్‌లో 24 మంది ఉన్నారు. 2019 నుంచి 2021 వరకు జరిగిన ఎన్నికల్లో గెలిచిన 2,495 మంది ప్రజాప్రతినిధుల అఫిడవిట్లను ప్రజాస్వామిక సంస్కరణల సంఘం (ఏడీఆర్) అధ్యయనం చేసి.. సోమవారం నివేదిక విడుదల చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(1),(2),(3)లో పేర్కొన్న నేరాల కిందకు వచ్చే కేసుల్లో కోర్టులు అభియోగాలు నమోదు చేసిన వారి వివరాలను అందులో వెల్లడించింది. ఈ సెక్షన్ల ప్రకారం నేరం రుజువై శిక్షలు పడితే వారిపై అనర్హత వేటు పడుతుంది. క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ ప్రజాప్రతినిధుల్లో ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి (రాజంపేట), అదే పార్టీ ఎంపీలు మార్గాని భరత్ (రాజమండ్రి), బెల్లాన చంద్రశేఖర్ (విజయనగరం), ఎంవీవీ సత్యనారాయణ (విశాఖ) ఉండగా.. రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి సహా 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
తెలంగాణలో ముగ్గురు ఎంపీలు.. సోయం బాపూరావు (బీజేపీ), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్), మాలోతు కవిత (టీఆర్ ఎస్)పై వివిధ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
జాతీయ స్థాయిలో..
దేశవ్యాప్తంగా 2019-21 మధ్య జరిగిన ఎన్నికల్లో గెలిచిన వారిలో 67 మంది ఎంపీలు, 296 మంది ఎమ్మెల్యేల (మొత్తం 363 మంది)పై అభియోగాలు నమోదై ఉన్నాయి. వీరిలో అత్యధికంగా బీజేపీకి చెందినవారు 83 మంది ఉండగా.. కాంగ్రెస్-47, టీఎంసీ-25 ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 39 మంది మంత్రులపై నేరాభియోగాలు నమోదయ్యాయి. అందులో నలుగురు కేంద్ర మంత్రులు కాగా,, 35 మంది వివిధ రాష్ట్రాల మంత్రులు.