తొలి సీజేఐగా మ‌హిళ… సుప్రీంకోర్టుకు ముగ్గురు మ‌హిళా న్యాయ‌మూర్తులు

కొన్నేళ్ల‌లో తొలి సీజేఐగా మ‌హిళ?.. సుప్రీంకోర్టుకు ముగ్గురు మ‌హిళా న్యాయ‌మూర్తులు స‌హా 9 మంది పేర్లు సిఫార‌సకేంద్రానికి సిఫార‌సు చేసిన కొలీజియంజాబితాలో తెలంగాణ హైకోర్టు సీజే జ‌స్టిస్ హిమా కోహ్లిక‌ర్ణాట‌క హైకోర్టు జ‌డ్జి జ‌స్టిస్ నాగర‌త్న కూడాజ‌స్టిస్ నాగ‌ర‌త్న 2027లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం విధాత:సుప్రీంకోర్టులో న్యాయ‌మూర్తుల నియామ‌కం కోసం కేంద్ర ప్ర‌భుత్వానికి కొలీజియం సిఫార‌సులు చేసింది. ముగ్గురు మ‌హిళా న్యాయ‌మూర్తులు స‌హా 9 మంది పేర్లు ఇందులో ఉన్నాయి. తెలంగాణ హైకోర్టు సీజే […]

తొలి సీజేఐగా మ‌హిళ… సుప్రీంకోర్టుకు ముగ్గురు మ‌హిళా న్యాయ‌మూర్తులు

కొన్నేళ్ల‌లో తొలి సీజేఐగా మ‌హిళ?.. సుప్రీంకోర్టుకు ముగ్గురు మ‌హిళా న్యాయ‌మూర్తులు స‌హా 9 మంది పేర్లు సిఫార‌స
కేంద్రానికి సిఫార‌సు చేసిన కొలీజియం
జాబితాలో తెలంగాణ హైకోర్టు సీజే జ‌స్టిస్ హిమా కోహ్లి
క‌ర్ణాట‌క హైకోర్టు జ‌డ్జి జ‌స్టిస్ నాగర‌త్న కూడా
జ‌స్టిస్ నాగ‌ర‌త్న 2027లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం

విధాత:సుప్రీంకోర్టులో న్యాయ‌మూర్తుల నియామ‌కం కోసం కేంద్ర ప్ర‌భుత్వానికి కొలీజియం సిఫార‌సులు చేసింది. ముగ్గురు మ‌హిళా న్యాయ‌మూర్తులు స‌హా 9 మంది పేర్లు ఇందులో ఉన్నాయి. తెలంగాణ హైకోర్టు సీజే జ‌స్టిస్ హిమా కోహ్లి పేరు కూడా ఇందులో ఉంది. అలాగే, క‌ర్ణాట‌క హైకోర్టు జ‌డ్జి జ‌స్టిస్ నాగర‌త్న, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది పేర్లు ఉన్నాయి. సీనియ‌ర్ జ‌డ్జి నాగ‌రత్న‌ ఒకవేళ సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా నియామకమైతే 2027లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది.

ఇదే జ‌రిగితే తొలి మ‌హిళా సీజేఐగా ఆమె చరిత్ర సృష్టిస్తారు. ఇక, సుప్రీంకోర్టు జ‌డ్జిగా మ‌ద్రాస్ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎంఎం సుంద‌రేశ్, క‌ర్ణాట‌క హైకోర్టు సీజే ఎస్ ఓకా, సిక్కిం హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ జేకే మ‌హేశ్వ‌రి, కేర‌ళ హైకోర్టు సీజే పీటీ ర‌వికుమార్, క‌ర్ణాట‌క హైకోర్టు జ‌డ్జి జ‌స్టిస్ నాగార్జున ఉన్నారు. అంతేకాదు, సుప్రీంకోర్టు జ‌డ్జిగా సీనియ‌ర్ న్యాయ‌వాది పీఎస్ న‌ర‌సింహ పేరు కూడా జాబితాలో ఉంది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఈ తొమ్మిది మంది న్యాయమూర్తులతో కేంద్ర ప్ర‌భుత్వానికి సిఫార‌సులు చేసింది. సుప్రీంకోర్టులో మొత్తం 10 జ‌డ్జిల‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2019, సెప్టెంబ‌రు నుంచి జ‌డ్జిల నియామ‌కాలు జ‌ర‌గ‌లేదు.

ఇప్పుడు తొమ్మిది మంది న్యాయమూర్తుల నియమకానికి కొలీజియం సిఫార‌సులు చేసింది. సుప్రీంకోర్టులో ప్ర‌స్తుతం ఒక మహిళా జ‌డ్జి మాత్రమే ఉన్నారు. జస్టిస్ ఇందిరా బెనర్జీ 2022, సెప్టెంబరులో రిటైర్ కానున్నారు. సుప్రీంకోర్టు చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం ఎనిమిది మంది మహిళ‌లు మాత్ర‌మే న్యాయ‌మూర్తులుగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు.